Movie News

జైలర్ OTT అదిరిపోయే ట్విస్టు

సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన జైలర్ నెల రోజులు తిరక్కుండానే ఓటిటిలో వచ్చేస్తోంది. సెప్టెంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. ఆగస్ట్ 10న రిలీజైన ఇంత పెద్ద హిట్టు సినిమాని త్వరగా డిజిటల్ విడుదల చేయడానికి కారణం లేకపోలేదు. ఇటీవలే జైలర్ హెచ్డి వెర్షన్ ఆన్ లైన్ లో లీకైపోయింది. ఒరిజినల్ డాల్బీ సౌండ్ తో అదిరిపోయే క్లారిటీతో ఉన్న ప్రింట్ చూసి అందరూ షాక్ తిన్నారు. ఇది విస్తృతంగా వైరల్ కావడంతో దాని ప్రభావం ఏకంగా థియేటర్ రెవిన్యూ మీద కూడా పడింది. దీంతో డేట్ లాక్ చేశారు.

ట్విస్టు ఏంటంటే జైలర్ నిర్మించింది సన్ పిక్చర్స్. వాళ్లకు స్వంతంగా ఓటిటి ఉంది. నెట్ ఫ్లిక్స్ తో టై అప్ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. అయినా సరే అనూహ్యంగా ప్రైమ్ కి ఇవ్వడం షాక్ ఇచ్చేదే. సుమారు వంద కోట్లకు పైగా ఈ డీల్ జరిగినట్టుగా చెన్నై టాక్. ఈ మొత్తం ముట్టడం వల్లే నిర్మాత దయానిధి మారన్ రజనీకాంత్ కు ప్రత్యేకంగా ఒక చెక్కు, ఖరీదైన కారుతో పాటు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు గిఫ్ట్ ఇచ్చినట్టు చెన్నై టాక్. ఈ వారంలోనే అనిరుద్ రవిచందర్ తో పాటు విలన్ వినాయకన్ కు సైతం కానుకలు ముట్టజెప్పబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

అభిమానులు ఒకవైపు కలెక్షన్లు తగ్గుతాయనే బాధ పడుతూనే ఇంత త్వరగా జైలర్ ని చిన్నితెరపై చూసుకోవచ్చని సంబరపడుతున్నారు. అయినా బ్లాక్ బస్టర్లు సైతం నాలుగు వారాల గ్యాప్ ని నిలకడగా మెయింటైన్ చేయలేకపోతే ఇక చిన్న చిత్రాల సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. గత కొంత కాలంగా సౌత్ కంటెంట్ విషయంలో కొంచెం వెనుకబడి ఉన్న ప్రైమ్ కు జైలర్ నుంచి పెద్ద బూస్ట్ దక్కుతుందని అంచనాలున్నాయి. నెట్ ఫ్లిక్స్ తో పోటీ దృష్ట్యా రజనీకాంత్ మూవీ కోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టు ఓటిటి వర్గాల కథనం. 

This post was last modified on September 2, 2023 2:30 pm

Share

Recent Posts

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

35 minutes ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

54 minutes ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

59 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

2 hours ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

5 hours ago

నార్త్ రాముడు.. సౌత్ శివుడు… రేవంత్ కరెక్టేనా?

రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…

5 hours ago