నెలల తరబడి ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న సలార్ విడుదల సంవత్సరాల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. సెప్టెంబర్ 28కి కేవలం ఇంకో నాలుగు వారాలు మాత్రమే దూరముంది. కాలం ఇట్టే కరిగిపోతున్న ట్రెండ్ లో చూస్తుండగానే రిలీజ్ డేట్ వచ్చేస్తుంది. ఇప్పటిదాకా కేవలం ఒకే ఒక్క చిన్న టీజర్ తో హైప్ ని పెంచేసుకున్న సలార్ బిజినెస్ భీభత్సంగా జరుగుతోంది. ఒక్క నైజామ్ ఏరియానే ఎనభై కోట్లకు అమ్మారనే వార్త ట్రేడ్ మతులు పోగొట్టింది. సీడెడ్ లాంటి ప్రాంతాల్లో ఆశించిన దాని కన్నా కొంత తక్కువ ఫిగర్ నమోదైనా వసూళ్ల ఊచకోత మాములుగా ఉండబోవడం లేదు.
నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలిమ్స్ విపరీతమైన పని ఒత్తిడిలో ఉంది. ఆగస్ట్ చివరి వారంలో ప్లాన్ చేసుకున్న ట్రైలర్ లాంచ్ ని టైం సరిపోక వాయిదా వేయాల్సి వచ్చింది. ఫైనల్ కాపీని సిద్ధం చేయడంలో దర్శకుడు ప్రశాంత్ నీల్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ చాలా బిజీగా ఉన్నారు. స్టూడియో నుంచి కాసేపు బయటికి వచ్చి రిలాక్స్ కాలేనంత వర్క్ ప్రెజర్ లో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్లు, మీడియా ఇంటర్వ్యూలు, ఫ్యాన్ మీట్లు, ఇండియా టూర్లు ఇలా చాలా ప్లాన్ చేసుకోవాలి. చేతిలో ఉన్న అతి తక్కువ టైంలో ఇన్ని డెడ్ లైన్లు మీట్ కావడం కష్టం.
అయినా సరే ఆరు వెయ్యి అయినా టార్గెట్ ని చేరుకోవాల్సిందే. యుఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే అర మిలియన్ దాటేసి కొత్త రికార్డుల కోసం పరుగులు పెడుతున్నాయి. ప్రీమియర్లు మొదలయ్యేనాటికి కనీసం రెండు మిలియన్లు దాటడం ఖాయమనే అంచనాలు బలంగా ఉన్నాయి. శృతి హాసన్ ఇటీవలే డబ్బింగ్ పూర్తి చేయగా పృథ్విరాజ్ సుకుమారన్ ది ఈ వారంలోనే ఫినిష్ చేయబోతున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకంగా మారబోతున్న నేపథ్యంలో రవి బస్రూర్ దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. అయిదు నిమిషాల తక్కువతో మూడు గంటల నిడివితో సలార్ పెద్ద యాక్షన్ ట్రీట్ ఇవ్వనుంది.
This post was last modified on September 1, 2023 11:21 am
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…
ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి…