జవాన్ ట్రైలర్ లో షారుఖ్ ఖాన్ ని చాలా అవతారాల్లో చూసేసరికి ఫ్యాన్స్ ఆనందంలో, ప్రేక్షకులు అయోమయంలో మునిగిపోయారు. ఊహించిన దానికన్నా పెద్ద బడ్జెట్ తో ఈ యాక్షన్ గ్రాండియర్ రూపొందటం చూసి షాక్ తిన్నారు. అయితే దీని కథ విషయంలో ముందు నుంచి ఇది కమల్ హాసన్ ఓరు ఖైతియిన్ డైరీ(తెలుగులో ఖైదీ వేట)కి ఫ్రీ మేక్ అనే ప్రచారం షూటింగ్ దశ నుంచే ఉంది. విజయ్ తేరిని కూడా దర్శకుడు అట్లీ తెలివిగా విజయ్ కాంత్ క్షత్రియుడు నుంచి తీసుకుని దాన్ని ఇప్పటి ఆడియన్స్ టేస్ట్ కి అనుగుణంగా మార్చి హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే.
జవాన్ కు సైతం ఇదే ఫార్ములాని అనుసరించినట్టు అర్థమవుతోంది. అదెలాగో చూద్దాం. ట్రైలర్ లో చూపించిన ప్రకారం ఇది తండ్రి కొడుకుల కథ. నాన్న రివెంజ్ కు తెగబడితే కొడుకు ఖాకీ చొక్కా వేసుకుని దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. కమల్ మూవీలో తనకు అన్యాయం చేసిన వాళ్ళ అంతం చూసేందుకు హీరో శ్రీదేవిని కిడ్నాప్ చేస్తాడు. జవాన్ లో మెట్రో ట్రైన్ ని హైజాక్ చేసి డిమాండ్లు వినిపిస్తాడు. ఇది మొదటి మార్పు. ఒరిజినల్ వెర్షన్ ల తండ్రి పాత్ర ఓ మాములు పేద వ్యక్తి. షారుఖ్ ఖాన్ ఫ్లాష్ బ్యాక్ లో ఆర్మీలో పని చేసే టాప్ ఆఫీసర్ గా మార్చారు.
స్కేల్ ప్రకారం చూసుకుంటే జవాన్ ని వందల కోట్లతో తీస్తే అప్పట్లో ఖైదీ వేటని భారతిరాజా రీజనబుల్ బడ్జెట్ తో పూర్తి చేసి సంచలన విజయం అందుకున్నారు. ఒరిజినల్ లో ఇళయరాజా పాటలు, బిజిఎమ్ చాలా ప్లస్ అయ్యాయి. జవాన్ లో అనిరుద్ రవిచందర్ ఎలాంటి మేజిక్ చేశాడో థియేటర్లో చూడాలి. మొత్తానికి కాదనలేని కంపారిజన్లు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. యాక్షన్ ఓవర్ లోడ్ అయ్యిందనే కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపాక హైదరాబాద్ లో షారుఖ్ ని తీసుకొచ్చి మీడియా మీట్ చేసే ఆలోచనలో ప్రొడక్షన్ టీమ్ ఉంది.
This post was last modified on September 1, 2023 8:29 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…