ఒక సినిమా రీమేక్ ఎంచుకునే టైంలో దాని ఒరిజినల్ వెర్షన్ అందుబాటుని చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పటి ప్రేక్షకులు మరీ తెలివి మీరిపోయి ఎక్కడుందో వెతుక్కుంటున్నారు. బాష రాకపోతే సబ్ టైటిల్స్ సహాయంతో చూస్తున్నారు. లూసిఫర్ ని గాడ్ ఫాదర్ గా మొదలుపెట్టే టైంకి దాని తెలుగు డబ్బింగ్ తో సహా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. కానీ నిర్మాతలు ఆర్బి చౌదరి, ఎన్విఎస్ ప్రసాద్ ల నిర్లక్ష్యం వల్ల దాని తీయించే దిశగా ఎవరూ చర్యలు చేపట్టలేదు. ఫలితంగా ఎలాంటి కష్టం లేకుండా శుభ్రంగా మోహన్ లాల్ వెర్షన్ ని మన జనాలు చూసేశారు.
దాని ప్రభావం గాడ్ ఫాదర్ మీద గట్టిగానే పడింది. సెకండ్ హాఫ్ కొన్ని మార్పులు చేసినప్పటికీ అసలుదే బాగుందనే ఫీలింగ్ తెప్పించేశారు. దీని సంగతలా ఉంటే నా సామిరంగా విషయంలో మాత్రం అలాంటి పొరపాటుకి తావివ్వడం లేదు. దీని మాతృక పోరంజు మరియం జొస్ కొన్ని నెలల క్రితం వరకు ప్రైమ్ లో ఉండేది. కానీ ఇప్పుడు తీసేశారు. నాగ్ తన పలుకుబడి వాడి లేకుండా చేశారా లేక ముందస్తు అగ్రిమెంట్ లో భాగంగా వెళ్ళిపోయిందా అనేది తెలియదు కానీ అదే పనిగా చూద్దామని వెతకడానికి వెళ్లిన మూవీ లవర్స్ సెర్చ్ లో దొరక్క నిరాశ చెందుతున్నారు.
ఇదో మంచి స్ట్రాటజీ. ఇలా చేయడం వల్ల మొత్తం కట్టడి అయిపోతుందని కాదు. ఆన్ లైన్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఏదోలా ప్రింట్ పట్టుకుంటారు కానీ సామాన్య ప్రేక్షకులు మాత్రం లేదు కదాని అసలు సినిమా కోసం ఎదురు చూస్తారు. ఇకపై కూడా హక్కులు కొనే సమయంలో నిర్మాతలు ఈ జాగ్రత్త తీసుకుంటే సోషల్ మీడియా దాడిని సగం తప్పించుకోవచ్చు. లేకపోతే పోలికలు తీసుకొచ్చి లేనిపోని రచ్చ చేస్తారు. టీజర్ తోనే హైప్ తెచ్చేసుకున్న నా సామిరంగా రెగ్యులర్ షూటింగ్ వచ్చేనెల నుంచే ఏకధాటిగా జరగబోతోంది. బ్రేక్స్ లేకుండా షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నారట.
This post was last modified on August 31, 2023 9:20 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…