ఇండియన్ వెబ్ సిరీస్ లలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఏదంటే ముందు గుర్తొచ్చే పేరు ది ఫ్యామిలీ మ్యాన్. తెలుగు వాళ్ళైన రాజ్ అండ్ డికెల దర్శకత్వ సత్తా ప్రపంచానికి తెలిసింది కూడా దీని వల్లే. ఇది ఎంత పెద్ద సక్సెస్ అంటే మొదటి సీజన్ రెస్పాన్స్ చూసి సెకండ్ పార్ట్ కి అమాంతం బడ్జెట్ పెంచేసి సమంతా లాంటి స్టార్ క్యాస్టింగ్ ని నెగటివ్ రోల్ కి ఒప్పించే స్థాయికి వెళ్ళింది. సినిమా కెరీర్ నెమ్మదిస్తున్న టైంలో మనోజ్ బాజ్ పాయ్ కి ఒక్కసారిగా ఈ ఫ్యామిలి మ్యాన్ పెద్ద బూస్ట్ గా పనిచేసి ఆయన్ని బాలీవుడ్ బిజీ ఆర్టిస్టుల్లో ఒకరిగా మార్చింది. డేట్లు కావాలన్నా దొరికే పరిస్థితి లేదు.
సరే దీనికి మెగాస్టార్ కి సంబంధం ఏమనుకుంటున్నారా. నిజానికి ఫ్యామిలీ మ్యాన్ ని సినిమాగా తీయాలనే రాజ్ అండ్ డికె స్క్రిప్ట్ సిద్ధం చేశారు. నిర్మాత అశ్వినీదత్ గారికి సబ్జెక్టు విపరీతంగా నచ్చేసి చిరంజీవికి వినిపించారు. అప్పుడే ఖైదీ నెంబర్ 150 విజయాన్ని ఆస్వాదిస్తున్న చిరుకి స్టోరీ నచ్చింది కానీ తాను పిల్లల తండ్రిగా, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉన్న లేడీకి భర్తగా అంటే ప్రేక్షకులు అంగీకరించరేమోనన్న అనుమానం కలిగింది. పోనీ ఇద్దరు పిల్లలు లేకుండా కొంచెం మార్చమని అడిగారు. ఇన్ని సంశయాల మధ్య అది ముందుకు వెళ్ళలేదు.
కట్ చేస్తే అదే ఫ్యామిలీ మ్యాన్ ని వెబ్ సిరీస్ గా మార్చి మనోజ్ ని తీసుకురావడం కొత్త మలుపుకి దారి తీసింది. ఒకవేళ చిరంజీవి ఫ్యామిలీ మ్యాన్ ని సినిమాగా చేసి ఉంటే ఎలా ఉండేదో కానీ సరైన నిర్ణయమే తీసుకున్నారనిపిస్తోంది. లేదూ కొన్ని కీలక మార్పులతో ప్రాజెక్టు ఓకే అయ్యుంటే ఒక సెన్సేషన్ గా నిలిచే అవకాశాలనూ కొట్టి పారేయలేం. ఇదంతా స్వయంగా అశ్వినిదత్ గారే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ఈ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చిరంజీవికి ఫ్యామిలీ మ్యాన్ లాంటి పాత్రలు నిజంగానే బాగుంటాయి. ట్రై చేస్తే అద్భుతాలే జరగొచ్చు.
This post was last modified on August 30, 2023 11:13 am
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తామే విజయం దక్కించుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు…
వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…
మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…
ఒక సినిమా పెద్ద హిట్టయితే దర్శకుడికి నిర్మాత కారు ఇవ్వడం చాలా సందర్భాల్లో చూశాం. ఈ మధ్య ఇదొక ట్రెండుగా…