ఇటీవలే ప్రకటించిన 69వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకోబోతున్న మొదటి తెలుగు హీరోగా సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మరిన్ని మైలురాళ్ళు తోడవుతున్నాయి. సుప్రసిద్ధ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ఇన్స్ టా గ్రామ్ తో జరిగిన కొలాబరేషన్ లో భాగంగా తన రోజువారీ జీవితాన్ని వీడియో రూపంలో పబ్లిక్ కి చూపించే అరుదైన అవకాశం అందుకున్నారు. దీని కోసం ప్రత్యేకంగా సదరు టీమ్ వచ్చి దగ్గరుండి మరీ బన్నీ దైనందిన కార్యక్రమాలను షూట్ చేసి నీట్ గా ప్రెజెంట్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు.
ఉదయాన్నే లేచాక ధ్యానం వగైరాలు చేసుకుని, గార్డెన్ లో కాఫీ తాగి, ఆ తర్వాత ఇతరత్రా పూర్తి చేసుకుని, కారులో రామోజీ ఫిలిం సిటీకి వెళ్లడం, అక్కడ సుకుమార్ తో క్యారవాన్ లో కూర్చుని ఆ రోజు తీయాల్సిన సీన్ల తాలూకు డైలాగులు ప్రాక్టీస్ చేసి, మేకప్ వేసుకుని పుష్ప పార్ట్ 2 చిత్రీకరణలో పాల్గొనడం ఇలా మొత్తం చకచకా చూపించేశారు. ఎర్ర చందనం దుంగలు లారీలో ఎత్తుతున్న సందర్భంలో పుష్ప రాజ్ అక్కడికి వచ్చి అందరికీ ఆదేశాలిచ్చే సీన్లను పూర్తి చేశారు. బన్నీ గెటప్ ఎలా ఉండబోతోందో ఈ వీడియోతో మరింత క్లారిటీ వచ్చేసింది. ఒకరకంగా ఇది సెకండ్ లుక్ అని చెప్పాలి.
ఇంటి మొత్తాన్ని చూపించలేకపోయినా ఉన్న తక్కువ నిడివిలో రోజు షెడ్యూల్ ఎలా ఉంటుందనే క్లారిటీ అయితే అభిమానులకు ఇచ్చారు. పుష్ప 2 మీద అంచనాలు ఇప్పుడు మాములుగా లేవు. నార్త్ బిజినెస్ లోనూ బయ్యర్లు క్రేజీ రేట్లకు రెడీ అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ మాత్రం ట్రైలర్ వదిలాకే డీల్స్ క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నారు. ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన అల్లు అర్జున్ కి మంచి మంచి స్పెషల్ మూమెంట్స్ తోడవుతున్నాయి. ఇన్స్ టాలో పోస్ట్ చేయడం ఆలస్యం క్షణాల్లో అది వైరల్ కావడం, స్క్రీన్ షాట్లు చక్కర్లు కొట్టడం జరిగిపోతోంది
This post was last modified on August 30, 2023 11:11 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…