స్టార్ హీరో సినిమా అంటే అప్ డేట్స్ కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ ఎప్పుడూ ఉంటారు. కానీ ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ కోసం ఏ అభిమానులు ఎదురుచూడని విధంగా చూస్తున్నారు. దీనికి కారణం ఈ మధ్య మహేష్ , తమన్ మధ్య చెడిందనే వార్త ఒకటి బయటికి రావడమే. పూజ హెగ్డే తో పాటు తమన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి అవుట్ అనే మాట గట్టిగా వినిపించింది. మళ్ళీ త్రివిక్రమ్ మహేష్ ను ఒప్పించుకున్నాడని ఏవో వార్తలు వచ్చాయి.
నిజానికి గుంటూరు కారం మ్యూజిక్ విషయంలో తెరవెనుక ఏదో జరిగిన మాట నిజమే. అందుకే తమన్ కూడా ఈ ఆల్బమ్ ను ఛాలెంజింగ్ గా తీసుకొని మహేష్ తో పాటు అతని అభిమానులని కూడా మెప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా ఫస్ట్ సింగిల్ ను ఇప్పటికే ముగ్గురు నలుగురు సింగర్స్ తో పాడించాడు. తాజాగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ విశాల్ శేఖర్ లో ఒకరైన శేఖర్ రవ్జియని చేత పాడించారు. మొస్ట్లీ శేఖర్ పాడిన వర్షనే బయటికి రానుందని తెలుస్తుంది. శేఖర్ అల్లు అర్జున్ కోసం నా పేరు సూర్య లో ఓ సాంగ్ పాడాడు. ఇప్పుడు మహేష్ కి పాడాడు.
మహేష్ , త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం ఏ ముహూర్తాన మొదలిందో కానీ అప్పటి నుండి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. షూటింగ్ కూడా నత్త నడక నడుస్తుంది. మ్యూజిక్ విషయంలో త్రివిక్రమ్ , తమన్ ఇద్దరు కిందా మీదా అవుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ డిసెంబర్ కల్లా ఘాట్ పూర్తి చేసి సంక్రాంతి రేస్ లోనే నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫస్ట్ సింగిల్ సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
This post was last modified on August 29, 2023 7:59 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…