బాక్సాఫీస్ వద్ద సునామిలా విరుచుకుపడుతూ ఆరు వందల కోట్లను అందుకున్న జైలర్ కు ఢిల్లీ హై కోర్టు షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి సినిమాని ఏ రూపంలో ప్రదర్శించినా అందులో ఎక్కడా ఐపీఎల్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జెర్సి కనిపించకుండా చేయాలని ఆర్డర్ వేసింది. అదేంటి ఎక్కడ ఉందనుకుంటున్నారా. రజనీకాంత్ మనవడి మీద హత్య ప్రయత్నం చేసిన ఇద్దరు రౌడీలు తర్వాత ఆయన్ని చీకట్లో వెంటాడుతారు. దాంట్లో ఒకడు కోడలి మీద కామెంట్ చేస్తాడు. మొదటి వాడి తల నరికిన తర్వాత రెండో వాడిని గొంతులో పొడుస్తాడు. అక్కడ ఆ ఆకతాయి ఆర్సిబి చొక్కా వేసుకుని ఉంటాడు.
దీని మీద అభ్యంతరం వ్యక్తం కావడంతో కేసు న్యాయస్థానం దాకా వెళ్ళింది. వెంటనే దాన్ని మార్చాలని ఇకపై థియేటర్, ఓటిటి, శాటిలైట్ ఎక్కడైనా సరే ఇది కనిపించకూడదని స్పష్టం చేసింది. రిలీజైన పద్దెనిమిది రోజుల తర్వాత ఈ జడ్జ్ మెంట్ రావడం విశేషం. అయినా చెన్నై సూపర్ కింగ్స్ చొక్కా వేయించకుండా కావాలనే బెంగళూరు మీద పంచు వేశారని కొందరు ఫీలయ్యారు. సన్ సంస్థ స్వంత టీమ్ అయిన హైదరాబాద్ సన్ రైజర్స్ ని సైతం వాడలేదని ఎత్తి చూపారు. ఏదైతేనేం మొత్తానికి చాలా చిన్న విషయం అనుకున్నది కాస్తా పెద్దదిగా మారి ఇలా మలుపు తిరిగింది
దీని వల్ల జైలర్ కు వచ్చిన లాభం నష్టం ఏమి లేకపోయినా బెంగళూరు అభిమానులకు ఊరట కలిగింది. గెలుపోటములు పక్కనపెడితే ఆ టీమ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్దదే. మరి వాళ్ళ మనోభావాలు దెబ్బ తినేలా సీన్ పెడితే ఎందుకు ఊరుకుంటారు. నిజానికా సీన్ లో రజనీకాంత్ ని తప్ప ఆడియన్స్ ఇంకెవరిని పట్టించుకోలేనంత తన్మయత్వంలో మునిగిపోయారు. ఇప్పుడీ విషయం తెలిశాకే అవునా అని ఆశ్చర్యపోయిన వాళ్ళు లక్షల్లో ఉంటారు. అయినా క్యారెక్టర్ ఆర్టిస్టు వేసుకున్న కాస్ట్యూమ్ కూడా ఒక్కోసారి ఇంత దూరం తీసుకెళ్తుందనుకుంటే ఆశ్చర్యం కలిగించే విషయమే.
This post was last modified on August 28, 2023 6:55 pm
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…