మాములుగా స్టార్ హీరోల వారసులు నటన వైపే మొగ్గు చూపుతారు. తండ్రి నడిచిన బాటలో రెడీ మేడ్ గా ఉన్న ఫాలోయింగ్ ని వాడుకుని త్వరగా పైకి ఎక్కొచ్చని ప్లాన్ చేసుకుంటారు. కానీ కోలీవుడ్ స్టార్ విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దానికి భిన్నంగా దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నాడు. ఇతని మొదటి ప్రాజెక్టుని సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు అధికారికంగా అగ్రిమెంట్ చేసుకుని ఆ కంపెనీ అధినేత సుభాస్కరన్ చేతుల మీదుగా ఒప్పందాల మీద సంతకాలు చేసుకుని ఫోటో కూడా సోషల్ మీడియాలో పెట్టేశారు.
ఈ అనూహ్య నిర్ణయం పట్ల ఫ్యాన్స్ షాక్ అవుతున్నా జేసన్ సంజయ్ తన తాత ఎస్ఏ చంద్రశేఖర్ అడుగుజాడల్లో నడవాలనుకున్న విషయం అర్థమైపోయింది. ఆయన తమిళ తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్లు తీశారు. చిరంజీవికి మంచి హిట్ మూవీగా నిలిచిన చట్టానికి కళ్ళు లేవు విజయ్ తండ్రిదే. రిటైర్ అయ్యేనాటికి కొడుకుని ఇండస్ట్రీలో సెటిల్ చేయాలన్న ఉద్దేశంతో చాలా కష్టపడ్డారు. పెద్ద బ్యానర్లతో మాట్లాడి మంచి కాంబినేషన్లు వచ్చేలా చూసుకున్నారు. కొంత కాలం తర్వాత వరస సక్సెస్ లు వచ్చి విజయ్ కోలీవుడ్ లోనే అతి పెద్ద స్టార్ గా ఎదిగి వందల కోట్ల మార్కెట్ సంపాదించుకున్నాడు.
షారుఖ్ ఖాన్ కొడుకు సైతం ఇదే తరహాలో ముందు డైరెక్షన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జేసన్ సంజయ్ అదే బాట పట్టడం విశేషం. వెంకట్ ప్రభుతో చేస్తున్న సినిమా తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాల వైపు వస్తున్నాడనే ప్రచారం నేపథ్యంలో అభిమానులు సంజయ్ ని తెరమీద చూసుకోవచ్చని ఎదురు చూశారు. కానీ ఈలోగా ట్విస్టు వచ్చింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో ప్రూవ్ చేసుకున్నాకే హీరో కావాలా వద్దాని అతను డిసైడ్ అవుతాడట. హీరోగా ధృవ్ విక్రమ్, హీరోయిన్ గా అదితి శంకర్, సంగీత దర్శకుడిగా అమీన్ ని లాక్ చేసుకున్నారని లేటెస్ట్ అప్డేట్.
This post was last modified on August 28, 2023 6:50 pm
అడిగింతే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…