సినిమాల రేంజ్, సక్సెస్ రేట్ పరంగా చూసుకుంటే టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడు బోయపాటి శ్రీను. కానీ రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల మాదిరిగా దర్శకుడిగా అతను ఒక స్థాయిని అందుకోలేదు, గౌరవం సంపాదించుకోలేదు అన్నది వాస్తవం. అందుక్కారణం.. అతడివన్నీ మూస కథలు కావడం, నరేషన్ కూడా రొడ్డకొట్టుడు స్టయిల్లో ఉండడమే. తొలి చిత్రం ‘భద్ర’ను స్టైలిష్‌గా, యూత్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేసిన బోయపాటి.. ఆ తర్వాత మాత్రం పూర్తిగా మాస్ రూట్లోకి వెళ్లిపోయాడు.
టాలీవుడ్లో ఎప్పుడో పక్కన పెట్టేసిన సగటు కమర్షియల్ ఫార్ములాను నమ్ముకునే ఇప్పటికీ అతను సినిమాలు తీస్తున్నాడు. ఐతే నందమూరి బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గ సినిమాలు తీస్తూ.. ఆయనతో వరుసగా బ్లాక్‌బస్టర్లు ఇవ్వడం వల్ల బోయపాటి బండి నడుస్తోంది. చివరగా బాలయ్యతో అతను తీసిన ‘అఖండ’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.
ఐతే బాలయ్యతో బోయపాటికి సింక్ కుదిరినట్లు.. మిగతా హీరోలతో సెట్ కావట్లేదు. ‘సరైనోడు’ డివైడ్ టాక్‌ను తట్టుకుని వసూళ్లు సాధించింది కానీ.. అది పూర్తిగా సంతృప్తినిచ్చిన చిత్రమైతే కాదు. ఇక రామ్ చరణ్‌తో తీసిన ‘వినయ విధేయ రామ’ ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. ‘జయ జానకి నాయక’ సైతం ఆకట్టుకోలేకపోయింది. బాలయ్యతో జట్టు కట్టినపుడల్లా బ్లాక్‌బస్టర్లు వస్తున్నాయి కానీ.. వేరే హీరోలతో మాత్రం బోయపాటి సరైన హిట్ కొట్టట్లేదు. ఇప్పుడు రామ్‌తో ఆయన చేసిన ‘స్కంద’ ప్రోమోలు చూస్తే మరీ మూసగా అనిపిస్తున్నాయి. రామ్‌తో మరీ ఆ స్థాయిలో వయొలెన్స్ చేయించడం అంత బాగా అనిపించడం లేదు.
యాక్షన్ సన్నివేశాలు మరీ అతిగా అనిపిస్తున్నాయి. ఇవే సీన్లు బాలయ్యకు అయితే వేరేలా ఉంటాయి. బాలయ్యకు అప్లై చేసిన ఫార్ములానే బోయపాటి వేరే వాళ్లకు చేస్తే మాత్రం అతిగా, సిల్లీగా అనిపిస్తున్నాయి. ‘వినయ విధేయ రామ’లో బోయపాటి మార్కు మాస్ సీన్లు పెద్ద ట్రోల్ మెటీరియల్ లాగా మారిన సంగతి తెలిసిందే. ‘స్కంద’కు కూడా అలాంటిది రిపీటవుతుందేమో అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. మరి నాన్ బాలయ్య సినిమాలనగానే బోయపాటికి షాక్‌లు తగులుతున్న నేపథ్యంలో ఈసారి అతను గండాన్ని ఎలా గట్టెక్కుతాడో చూడాలి.
This post was last modified on August 28, 2023 12:59 pm
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…