విపరీతమైన అంచనాలు మోసుకొచ్చే స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా సరే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. అందులోనూ పవర్ స్టార్ మూవీ అంటే చెప్పేదేముంది. మూడు రీమేకులు వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో తర్వాత చేస్తున్న స్ట్రెయిట్ మూవీగా ఓజి మీద హైప్ అంతకంతా వైరల్ ఫీవర్ లా అభిమానులే పెంచేస్తున్నారు. పరస్పరం ట్వీట్లు మెసేజులు పెట్టుకుంటూ, వీడియో చూశాక చనిపోయినా పర్వాలేదనే రేంజ్ లో దర్శకుడు సుజిత్ మాస్ సంభవం చూపిస్తాడని తెగ ఊరించుకుంటూ బజ్ ని అమాంతం పెంచేస్తున్నారు.
నిజానికి ఓజి టీజర్ రూపంలో వస్తున్న వీడియో కేవలం డెబ్భై సెకండ్లే. రెండు పవర్ ఫుల్ షాట్లు పెట్టేసి, టైటిల్ కార్డు, ఇంట్రో, ఎండ్ క్రెడిట్స్ అన్ని కలుపుకుని ఆ లెన్త్ ఉంటుందట. పవన్ స్వయంగా చెప్పే డైలాగు కూడా ఏమి ఉండదట. కేవలం అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ లో ఎలివేషన్లు ఇచ్చేలా సుజిత్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. అలాంటప్పుడు మరీ ఎక్కువ ఊహించుకున్నా ప్రమాదమే. ఎందుకంటే ఏ కొంచెం నిరాశ పరిచినా ఇదే ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తారు. మేము అనుకున్న స్థాయిలో లేదని నెగటివ్ స్ప్రెడ్ చేస్తారు. ఇది లేనిపోని ఇబ్బందులను తెచ్చి పెడుతుంది.
ఇంకా షూటింగ్ చాలా బ్యాలన్స్ ఉన్న ఓజి నుంచి ఎక్కువ ఫుటేజ్ అందుబాటులో లేదు కాబట్టే ఉన్నంతలో బెస్ట్ ఇవ్వడానికి సుజిత్ ట్రై చేస్తున్నాడు. తమన్ కూడా ఈసారి ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడని చెప్పడంలో అనుమానం అక్కర్లేదు. ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఇన్ సైడ్ టాక్. ఒకానొక కాలంలో ముంబైని వణికించిన డాన్ కథ ఆధారంగా తీస్తున్నారని వినికిడి. ఇమ్రాన్ హష్మీ, శ్రేయ రెడ్డి, కిక్ శ్యామ్ లాంటి పెద్ద క్యాస్టింగ్ తో ప్యాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఓజి వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ ఉండొచ్చు.
This post was last modified on August 28, 2023 12:50 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…