బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పఠాన్ తర్వాత కొత్త ఊపిరినిచ్చిన బ్లాక్ బస్టర్ గా గదర్ 2 సృష్టించిన సంచలనం అయిదు వందల కోట్ల మార్కుకి తీసుకెళ్ళిపోయింది. చాలా బిసి సెంటర్స్ లో ఇంకా స్ట్రాంగ్ గా ఉండటం చూస్తే జనానికి ఏ రేంజ్ లో కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంతటి విజయాన్ని ఆస్వాదిస్తుండగానే ఈ సినిమా సంగీతానికి సంబంధించిన గొడవ కొత్త వివాదం రేపుతోంది. ఇరవై రెండేళ్ల ఏళ్ళ క్రితం వచ్చిన ఫస్ట్ గదర్ కు ఉత్తమ్ సింగ్ సంగీతం సమకూర్చారు. ఆయన స్వరపరిచిన పాటలు అప్పట్లో ఊపేశాయి. ఆడియో అమ్మకాలు భారీ ఎత్తున జరిగి ఎక్కడ చూసినా ఇదే మ్యూజిక్ వినిపించేది.
ముఖ్యంగా ఉడుజా కాలే కావా, మై నికలా గడి లేకే ఓ రేంజ్ ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. అయితే ట్రెండ్ ఫాలో అవుతూ దర్శకుడు అనిల్ శర్మ పెద్దాయనకు ఛాన్స్ ఇవ్వకుండా మిథున్ ని తీసుకొచ్చారు. అతను తనకిచ్చిన సూచనల ప్రకారమే వాటిని కొద్దిగా రీమిక్స్ చేశాడు. అవి బాగా రీచ్ అయ్యాయి. దీనిపై ఉత్తమ్ సింగ్ భగ్గుమన్నారు. తన అనుమతి లేకుండా, కనీసం చెప్పకుండా తన ట్యూన్స్ వాడుకున్నారని, ఇది క్షమించరాని నేరమని మీడియాకు చెప్పడంతో దుమారం మొదలైంది. లేదూ నేను ముందే సమాచారం ఇచ్చానని అనిల్ శర్మ చెప్పడంతో కథ కొత్త మలుపు తిరిగింది.
మిథున్ ఇంకో వెర్షన్ చెబుతున్నాడు. ఉత్తమ్ సింగ్ కి ముందే తెలుసని యూనిట్ చెప్పడం వల్ల తాను ప్రొసీడ్ అయ్యాయని, అయినా డబ్బులు పోసికొన్న మ్యూజిక్ కంపనీలకు ఆ హక్కులు ఉంటాయి తప్ప సంగీత దర్శకులకు కాదని అంటున్నాడు. అసలు తాను ఆ రెండు పాటలు వద్దు ఫ్రెష్ గా కంపోజ్ చేద్దామని చెప్పినా ఎమోషన్ కోసం కావాలని అడగటంతో చేశానని అన్నాడు. గతంలో ఇదే తరహా వివాదాలు ఇళయరాజా, బాలు, ఆడియో సంస్థల మధ్య వచ్చిన సంగతి తెలిసిందే. కాపీ రైట్ యాక్ట్ ఉన్నప్పటికీ తరచుగా ఇలాంటివి జరగడం అనూహ్యం. ఈ గదర్ 2 గొడవకు చర్చల ద్వారా చెక్ పెట్టుకుంటే మంచిది.
This post was last modified on August 28, 2023 10:53 am
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…