పరిశ్రమలో అదృష్టం కొందరితో భలే దోబూచులాడుతుంది. చేతికి వచ్చినట్టే వచ్చి క్షణంలో మాయమైపోతుంది. దర్శకుడు వేణు శ్రీరామ్ పరిస్థితి ఇలాగే ఉంది. ఎప్పుడో అల్లు అర్జున్ కి ఐకాన్ కథ వినిపించడం, దిల్ రాజు నిర్మాతగా ప్రాజెక్టు అనౌన్స్ చేయడం జరిగిపోయాయి. కట్ చేస్తే పుష్ప పార్ట్ 1 ది రైజ్ దెబ్బకు బన్నీ లెక్కలన్నీ మారిపోయాయి. ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక అప్ కమింగ్ డైరెక్టర్లతో రిస్క్ చేసే పరిస్థితిలో లేడు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ని వేణు శ్రీరామ్ బాగానే హ్యాండిల్ చేసినా ఇంకో పెద్ద స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు అది సరిపోలేదు. దీంతో వెయిటింగ్ తప్పలేదు.
కట్ చేస్తే ఇదే దిల్ రాజుతో నితిన్ హీరోగా ఇవాళ వేణు శ్రీరామ్ కొత్త సినిమా మొదలైపోయింది. పూజా కార్యక్రమాలు చేసేశారు. టైటిల్ తమ్ముడు. పవన్ కళ్యాణ్ ని విపరీతంగా అభిమానించే నితిన్ కి ఇంత కన్నా బెస్ట్ ఆప్షన్ ఏముంటుంది. ఒకవేళ పుష్ప అనేదే లేకపోయి ఉంటే ఐకాన్ ఖచ్చితంగా తెరకెక్కేదన్న మాట నిజమే. ఎందుకంటే అల వైకుంఠపురములో తర్వాత కూడా బన్నీ ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నాడు. ఆ ఊపులో కొంచెం వేగంగా కదిలి ఉంటే ఐకాన్ పట్టాలెక్కేదే. కానీ మిస్ అయిపోయింది. రోడ్ జర్నీ బ్యాక్ డ్రాప్ లో చాలా డిఫరెంట్ లైన్ తో రాసుకున్నారనే టాక్ అప్పట్లో వచ్చింది.
సరే ఇక్కడేది శాశ్వతం కాదు కాబట్టి వేణు శ్రీరామ్ తమ్ముడుతో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన అవసరమైతే ఉంది. ఎంసిఏలో వదినా మరిది తరహాలో ఇందులో కూడా సెంటిమెంట్ ప్లస్ ఎమోషన్ బలంగా ఉంటుందట. కమర్షియల్ అంశాలు మిస్ కాకుండానే కంప్లీట్ ఎంటర్ టైనర్ గా తీయబోతున్నట్టు తెలిసింది. ప్రముఖ ఛాయాగ్రాహకులు సేతు దీనికి బాధ్యతలు తీసుకోవడం విశేషం. దిల్ లాంటి సూపర్ హిట్టు, శ్రీనివాస కళ్యాణం లాంటి డిజాస్టర్ తర్వాత నితిన్ దిల్ రాజుల మూడో కలయిక ఇది. బడ్జెట్ కూడా భారీగా పెట్టబోతున్నారని వినికిడి. క్యాస్టింగ్, ఇతర వివరాలు త్వరలో తెలియబోతున్నాయి.
This post was last modified on August 27, 2023 10:55 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…