Movie News

సన్ సంస్థకు జైలర్ బంగారు గుడ్లు

ఒకపక్క హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ ఐపిఎల్ లో పరాజయాలు, మరోవైపు భారీ సినిమాలు ఎన్ని తీస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదనే బాధతో ఉన్న సన్ టీవీ సంస్థకు జైలర్ బంగారు బాతులా కనక వర్షం కురిపిస్తూనే ఉంది. మూడో వారంలోకి అడుగు పెట్టేసి 600 కోట్ల గ్రాస్ తో తమిళంలో అంత సులభంగా ఎవరూ అందుకోలేని నెంబర్లు రజనీకాంత్ నమోదు చేస్తున్నారు. మొన్న వీక్ డేస్ లో కొంత నెమ్మదించినప్పటికీ తిరిగి వారాంతంలో పుంజుకుని అనూహ్యంగా ఆక్యుపెన్సీలు పెంచేసుకుంటోంది. ఫైనల్ రన్ అయ్యేలోపు ఇంకో వంద కోట్లకు పైగా తోడయ్యేలా ఉంది.

బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగానే కాదు సన్ టీవీకి సంబంధించిన షేర్ మార్కెట్ ధర కూడా జైలర్ పుణ్యమాని అమాంతం పెరిగిపోతోంది. జూన్ చివర్లో 494 రూపాయలు ఉన్న ధర ఇప్పుడు ఏకంగా 592 రూపాయలు దాటేసింది. ఇదంతా జైలర్ ప్రభావమేనని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. కంపెనీ రెవిన్యూలో పది శాతం పెరుగుదలతో 1349 కోట్లకు చేరుకుంది. ఇది జైలర్ ముందు 1219 కోట్ల దగ్గర ఉంది. లాభాలు 55 శాతం పెరగడం అనూహ్యం. జైలర్ హక్కులు సన్ టీవీవి కావడం, త్వరలో ప్రీమియర్ జరిగి అమాంతం రాబడి పెరుగుతుందనే నేపథ్యంలో ధర దూసుకుపోతోంది.

ఒక సినిమా ఫలితం వల్ల సదరు కంపెనీ స్టాక్ మార్కెట్ ప్రభావం చెందడం అరుదుగా జరుగుతుంది. ఇదంతా రజని మానియా ఎఫెక్ట్ అని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇప్పటికైతే ఇతర భాషల్లో కొంత దూకుడు తగ్గినప్పటికీ ఒరిజినల్ వెర్షన్ మాత్రం తగ్గేదెలా అంటోంది. దెబ్బకు కొత్త రిలీజులు కొన్ని వాయిదా పడగా ధైర్యం చేసి వచ్చినవి సోసోగానే ఆడుతున్నాయి. సన్ నెక్స్ట్ స్ట్రీమింగ్ తో  పాటు వీలైనంత త్వరగా శాటిలైట్ ప్రీమియర్ కు ప్లాన్ చేస్తోంది యాజమాన్యం. టిఆర్పిలో సరికొత్త రికార్డులు నమోదవుతాయని అప్పుడే ఓ రేంజ్ అంచనాలు మొదలయ్యాయి. 

This post was last modified on August 27, 2023 2:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స‌స్పెండ్ చేస్తే.. మాతో క‌ల‌వండి: టీడీపీ నేత‌కు వైసీపీ ఆఫ‌ర్‌?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చెప్ప‌లేం. రాజ‌కీయాలు రాజ‌కీయాలే. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే ఎన్టీఆర్ జిల్లాలోనూ జ‌రుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…

53 minutes ago

షా, బాబు భేటీలో వైఎస్ ప్రస్తావన

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…

2 hours ago

టీడీపీపై తెలంగాణకు ఆశ చావలేదు!

అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…

3 hours ago

వైసీపీలో ఉక్కపోత ఈ రేంజిలో ఉందా?

ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…

4 hours ago

శంక‌ర్ ఆట‌లు ఇక సాగ‌వు

శంక‌ర్.. ఒక‌ప్పుడు ఈ పేరు చూసి కోట్ల‌మంది క‌ళ్లు మూసుకుని థియేట‌ర్ల‌కు వెళ్లిపోయేవారు. హీరోలు క‌థ విన‌కుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…

5 hours ago

దిల్ రాజు కోసం చరణ్ మరో సినిమా ?

యాదృచ్చికమో లేక కాకతాళీయమో చెప్పలేం కానీ హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు మధ్య కాంబో రెండుసార్లు ఒడిదుడుకులకు…

13 hours ago