గత కొన్నేళ్లలో పెద్ద విజయం సాధించిన చిన్న సినిమాల జాబితాలో పైన ఉండే చిత్రం బేబి. పెద్దగా పేరు లేని నటీనటులను పెట్టి దర్శకుడిగా ఒక్క సినిమా అనుభవం ఉన్న సాయిరాజేష్ తీసిన ఈ చిత్రం రూ.90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి సంచలనం రేపింది. మంచి టాక్ తెచ్చుకున్న చిత్రాలు కూడా తొలి వీకెండ్ తర్వాత డల్లయిపోతున్న రోజుల్లో ఈ సినిమా కొన్ని వారాల పాటు మంచి వసూళ్లతో సాగింది.
దీని తర్వాత రిలీజైన బ్రో, భోళా శంకర్ లాంటి పెద్ద సినిమాలను మించి బేబి కలెక్షన్లు తెచ్చుకోవడం సంచలనం రేపింది. ఇండిపెండెన్స్ డే వీకెండ్ వరకు థియేటర్లలో షేర్ రాబట్టిన ఈ చిత్రం తాజాగా ఆహా ఓటీటీ ద్వారా డిజిటల్ డెబ్యూ చేసింది. థియేటర్లలో అంత పెద్ద విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీలోనూ సంచలనం రేపుతోంది.
కేవలం 32 గంటల్లోనే బేబి స్ట్రీమింగ్ మినిట్స్ 100 మిలియన్లను దాటిపోవడం విశేషం. ఆహా వరకు ఇది రికార్డు అనడంలో సందేహం లేదు. తెలుగులో అత్యంత వేగంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ పూర్తి చేసుకున్న చిత్రాల్లో బేబి ఒకటి. ఆల్రెడీ థియేటర్లలో ఈ సినిమా చూసిన వాళ్లు… ఆహాలో ఇంకో రౌండ్ వేస్తున్నారు. ఇక థియేటర్లలో మిస్సయిన వాళ్లు ఎలాగూ ఓటీటీలో సినిమా చూసేందుకు ఉత్కంఠగా ఎదురు చూస్తుండటంతో ఈ సినిమాకు డిజిటల్‌గా మంచి రెస్పాన్స్ వస్తోంది.
డిజిటల్ రిలీజ్ గురించి చిత్ర బృందం కూడా బాగా ప్రమోట్ చేస్తోంది. మీడియాలో కూడా యాడ్స్ బాగా కనిపిస్తున్నాయి. ఇక సినిమాలోని సన్నివేశాల గురించి మరోసారి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. తద్వారా బేబి మళ్లీ ట్రెండ్ అవుతోంది. మొత్తంగా బేబి సాధించిన విజయం, దానికి వచ్చిన స్పందన కొన్నేళ్లు చెప్పుకునేలా ఉందనడంలో సందేహం లేదు.
This post was last modified on August 27, 2023 1:35 am
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…