బాలీవుడ్ లో అత్యంత వివాదాస్పద చిత్రాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న ది కాశ్మీర్ ఫైల్స్ కి జాతీయ ఉత్తమ సమైక్యత చిత్రంగా అవార్డు ఇవ్వడం గురించి మెల్లగా వివాదం రాజుకుంటోంది. ఒక అజెండాతో తీసిన ఇలాంటి సినిమాకు అర్హత లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ బహిరంగంగానే తన అసంతృప్తిని వెలిబుచ్చారు. 90 దశకంలో జరిగిన కాశ్మీర్ పండిట్ల ఊచకోత గురించి దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆవిష్కరించిన ఈ ఎమోషనల్ డ్రామాలో తప్పొప్పులను ఒక కోణంలోనే చూపించారని, దాని వల్ల ఒక వర్గం మీద తప్పుడు అభిప్రాయాలు ఏర్పడ్డాయని రిలీజ్ టైంలో చాలా విమర్శలు వచ్చాయి.
అసలు సమైక్యత ప్రశ్నే లేని కాశ్మీర్ ఫైల్స్ ని ఎలా గుర్తిస్తారని విమర్శకులు అంటున్నారు. గతంలో ఈ విభాగంలో పురస్కారం అందుకున్న రోజా, బొంబాయి, సప్తపది, రుద్రవీణ, బోర్డర్, షహీద్ ఉద్ధం సింగ్, పుకార్, మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్, జక్మ్ తదితర సినిమాలు చూస్తే జాతీయ స్థాయిలో సమైక్య వాదం అంటే ఏమిటో తెలుస్తుందని ఉదాహరణలు చెబుతున్నారు. ఇందులో నిజముంది. ఎందుకంటే ఈ క్యాటగిరీలో ఎంపికైన వాటిలో మంచి మానవతా విలువలు, సమైక్య జీవన సిద్ధాంతం పాటు మనుషులంతా ఒకటేననే సందేశం అంతర్లీనంగా ఉంటుంది.
కానీ కాశ్మీర్ ఫైల్స్ లో అవెక్కడ ఉన్నాయని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ముందు నుంచి దీనికి కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉందని, ఆ కారణంగానే ఇప్పుడీ సత్కారం ఇస్తున్నారని నిలదీస్తున్న వాళ్ళు లేకపోలేదు. రకరకాల కోణాల్లో అవార్డుల పట్ల వ్యక్తమవుతున్న అభిప్రాయాలను కమిటీ పెద్దలు పట్టించుకుంటారో లేదో కానీ ఈ మాత్రం స్పందన రాబోయే సంవత్సరాల్లో జరగబోయే ఎంపికల మీద కొంతైనా ప్రభావం చూపిస్తే మంచిదే. ఈ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీసిన ది వ్యాక్సిన్ వార్ వచ్చే నెల సెప్టెంబర్ 28న సలార్ తో పాటు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 26, 2023 11:01 am
ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న…
ప్రస్తుతం ఐటీ రాజధానిగా భాసిల్లుతున్న విశాఖపట్నానికి మహర్దశ పట్టనుంది. తాజాగా విశాఖపట్నానికి సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులకు చంద్రబాబు నేతృత్వంలోని…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగింది.…
ఐపీఎల్లో సాధారణంగా ఎక్కువ స్కోర్లు మాత్రమే విజయం అందిస్తాయని అనుకునే వారికి, పంజాబ్ కింగ్స్ తన తాజా విజయంతో ఊహించని…
డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…