టాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం దక్కడం ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్. బన్నీ కంటే ముందు తెలుగులో ఎంతోమంది గొప్ప నటులు ఎందరో, అద్భుతమైన పెర్ఫామెన్స్‌లు ఎన్నో ఉండగా.. విస్మరించడం బాధ కలిగించే విషయమే అయినా.. ఇప్పటికైనా మన నటుడు ఒకరికి గుర్తింపు లభించినందుకు సంతోషించాల్సిందే.
ఐతే ఇలాంటి పాత్రకు ఉత్తమ పురస్కారమా అంటూ కొందరు అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. ‘పుష్ప’లో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. లీడ్ రోల్ కాబట్టి హీరోలా చూస్తాం కానీ.. ఆ పాత్ర లక్షణాలు, చేసే పని ప్రకారం చూస్తే అదొక నెగెటివ్ రోల్. స్మగ్లర్‌ను హీరోగా చూపించడం ఏంటి అని గతంలో గరికపాటి నరసింహారావు లాంటి వాళ్లు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ పాత్రకు గాను బన్నీకి అవార్డు రావడాన్ని తప్పుబడుతున్నవారూ లేకపోలేదు.
కానీ అవార్డులు ఇచ్చేటపుడు పెర్ఫామెన్స్ చూస్తారే తప్ప అది ఎలాంటి పాత్ర అనేది చూడరు. మంచి పాత్రలు.. ఉదాత్తమైన పాత్రలకే అవార్డు ఇవ్వాలన్న రూల్ లేదు. ఇక్కడ సినిమాను సినిమా లాగే చూడాలి. పాత్ర లక్షణాలకు.. నటనకు సంబంధం లేదిక్కడ. సీనియర్ ఎన్టీఆర్ రావణాసురుడి పాత్రల్లో ఎంత గొప్ప నటన ప్రదర్శించారో తెలిసిందే. ఐతే రావణుడు చెడ్డవాడు కాబట్టి ఎన్టీఆర్‌ను ప్రతికూల దృష్టితో చూడలేం.
ఆయన నటనను తక్కువ చేయలేం. ఇక్కడ బన్నీ విషయంలోనూ ఈ కోణంలోనే ఆలోచించాలి. ఒక పాత్రను నటుడు ఎలా ఓన్ చేసుకున్నాడు.. ఆ పాత్రలో ఎలా ఒదిగిపోయాడు.. ఎంత కన్విన్సింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడుయ అన్నది ఇక్కడ ముఖ్యం. జ్యూరీ సభ్యులు ఆ దృష్టితో చూశారే తప్ప.. స్మగ్లర్ పాత్రకు జాతీయ అవార్డు ఏంటి అని ఆలోచించి ఉండరు. కాబట్టి విమర్శకులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని.. బన్నీకి అవార్డు రావడాన్ని మరోలా చూడకూడదు.
This post was last modified on August 25, 2023 4:31 pm
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…