ఆస్కార్ దాకా వెళ్లి నాటు నాటు పాటకు పురస్కారం అందుకున్న ఆర్ఆర్ఆర్ కు జాతీయ అవార్డుల్లో ఆరు విభాగాల్లో విజేతగా నిలవడం మరో సెలబ్రేషన్ కు కారణంగా నిలుస్తోంది. ఉత్తమ నటులుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఒకరికి లేదా ఇద్దరికీ సంయుక్తంగా రావొచ్చనే అంచనాలకు భిన్నంగా పుష్ప రాజ్ అలియాస్ అల్లు అర్జున్ దాని కొట్టేయడంతో ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది. దర్శకుడి గా రాజమౌళి సైతం విజేతగా నిలవలేకపోవడం ఫ్యాన్స్ ని కొంత బాధించినా ఫైనల్ గా ఎక్కువ క్యాటగిరీలలో గర్వంగా నిలబడిన ఘనత మాత్రం జక్కన్న సృష్టించిన విజువల్ వండర్ కే దక్కింది.
బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్ టైన్మెంట్ (అన్ని వర్గాలను అలరించిన వినోదాత్మక చిత్రం)గా ట్రిపులార్ యునానిమస్ గా నిలిచింది. కొమురం భీముడొ పాటకు గాను కాలభైరవ ఉత్తమ గాయకుడిగా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంఎం కీరవాణి (నేపధ్య సంగీతం) తన మిత్రుడు దేవిశ్రీప్రసాద్(పుష్ప పాటలు)తో కలిసి ఈ గౌరవాన్ని పొందబోతున్నారు. యాక్షన్ కొరియోగ్రఫీకి గాను కింగ్ సాలమన్, నృత్య దర్శకత్వానికి ప్రేమ్ రక్షిత్, స్పెషల్ ఎఫెక్ట్స్ కు గాను వి శ్రీనివాస్ మోహన్ టాలీవుడ్ బెస్ట్ మల్టీస్టారర్ కు పని చేసినందుకు గాను జాతీయ గౌరవం అందుకున్నారు.
ఆర్ఆర్ఆర్ ఇలా ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ మరికొన్ని అవార్డులు రావాల్సిందన్న అభిప్రాయం కొట్టిపారేయలేం కానీ నామినేషన్లు అధికంగా ఉన్న దృష్ట్యా కొన్ని పరిమితుల వల్ల ఇలాంటి నిర్ణయాలకు ప్రేరేపించి ఉండొచ్చు. ఆస్కార్ వచ్చిన ఆనందం కొన్ని నెలలు గడవటం ఆలస్యం ఇప్పుడీ గుడ్ న్యూస్ డివివి దానయ్య బృందాన్ని మరోసారి సంతోషంలో ముంచెత్తింది. పన్నెండు వందల కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త వసూళ్లతో జపాన్ లో ఇప్పటికీ అయిదు వందల రోజులకు పైగా ప్రదర్శితమవుతున్న ఆర్ఆర్ఆర్ ఇటు ఓటిటిలో అటు శాటిలైట్ లోనూ సంచలనాత్మక రికార్డులు నమోదు చేయడం తెలిసిందే.
This post was last modified on August 24, 2023 7:56 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…