Movie News

అనిరుధ్‌ను ఒప్పించడమే సగం సక్సెస్

ఇప్పుడు ఇండియాలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే.. మరో మాట లేకుండా అనిరుధ్ పేరు చెప్పేయొచ్చు. ‘జైలర్’ సినిమాతో సౌత్ ఇండియా అంతటా అతడి పేరు మార్మోగిపోతోంది. యావరేజ్ మూవీని కూడా తన బ్యాగ్రౌండ్ స్కోర్, పాటలతో అతను ఎలివేట్ చేసి బ్లాక్‌బస్టర్‌ను చేశాడంటూ అతడి మీద ప్రశంసలు కురుస్తున్నాయి. ‘జైలర్’తో ప్రేక్షకులను అతను మామూలుగా ఊపేయలేదు.

ఇంకొన్ని రోజుల్లోనే ‘జవాన్’తో మరోసారి అనిరుధ్ తన ముద్రను చూపిస్తాడని.. ఆ చిత్రంతో మొత్తం దేశాన్ని షేక్ చేస్తాడని భావిస్తున్నారు. ముఖ్యంగా ‘జైలర్’ సినిమాను అతను పైకి లేపిన తీరు చూసి ఎలాగైనా అనిరుధ్‌ను తమ సినిమాలోకి తీసుకోవాలని చాలామంది దర్శకులు, నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. భారీ పారితోషకాలు ఆఫర్ చేస్తున్నారు. కానీ ఇప్పటికే చాలా బిజీగా ఉన్న అనిరుధ్ అంత ఈజీగా సినిమా ఒప్పుకోవడం లేదు.

ఇలాంటి టైంలో అనిరుధ్‌ను.. నాగచైతన్య కొత్త చిత్రం కోసం ఒప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక ఫిషర్ మ్యాన్ బయోగ్రఫీ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని యువ దర్శకుడు చందు మొండేటి రూపొందించనున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బేనర్లో పెద్ద బడ్జెట్లో ఈ సినిమా తీయబోతున్నారు. కీర్తి సురేష్‌ను కథానాయికగా అనుకుంటున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత దర్శకుడిగా ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. ఓవైపు భారీ సినిమాలే చేస్తూ.. కొత్తగా ఎవరు కమిట్మెంట్ అడిగినా నో చెబుతున్న అనిరుధ్.. ఈ సినిమాకు ఓకే అన్నాడంటే అది పెద్ద విశేషమే.

బహుశా పారితోషకం కంటే కూడా ఈ కథ అతణ్ని ఎగ్జైట్ చేసి ఉండొచ్చు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడంటే చిన్నా పెద్దా తేడా చూడడు. ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’ లాంటి మిడ్ రేంజ్ సినిమాలకు కూడా అతను అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. కాబట్టి చైతూ సినిమాకు కూడా మంచి ఔట్ పుట్ ఆశించవచ్చు. ఇప్పుడు అతనున్న ఫాంలో ఈ సినిమాను ఒప్పుకోవడమే మంచి క్రేజ్ తీసుకొచ్చే విషయం. కాబట్టి అనిరుధ్‌ను ఒప్పించారంటే సినిమా సగం సక్సెస్ అయిపోయినట్లే.

This post was last modified on August 24, 2023 12:14 pm

Share

Recent Posts

కంచుకోట‌లో కొత్త క్యాండెట్‌ను రెడీ చేస్తోన్న జ‌గ‌న్‌..?

రాబోయే ఎన్నికల వ్యూహాల్లో భాగంగా వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు…

12 minutes ago

దుల్కర్ బెస్ట్ ‘సీతారామం’ కాదట

మలయాళ లెజెండరీ నటుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ తన మాతృభాషలో గొప్ప గొప్ప సినిమాలు చేశాడు. ఎన్నో సూపర్…

3 hours ago

`అయోధ్య‌`కు రాజ‌కీయ గ్ర‌హ‌ణం వీడిన‌ట్టేనా?!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత రామ‌జ‌న్మ‌భూమి అయోధ్యలో ఉన్న బాల‌రామ‌య్య ఆల‌యానికి రాజ‌కీయ గ్ర‌హ‌ణం వీడిన‌ట్టేనా? ఇక‌, ఆల‌యానికి రాజకీయ ప్ర‌భావం,…

6 hours ago

సూర్య ఛెప్పిన కార్తి ‘పొటాటో చిప్స్’ కథ

సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ సినీ బ్రదర్స్‌లో సూర్య-కార్తి ద్వయం ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరూ తండ్రి శివకుమార్…

6 hours ago

హీరో దర్శకత్వపు కల… అదెప్పుడు నెరవేరునో

టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…

8 hours ago

సాక్షిలో రెండో పేజీకి చేరిన రాజన్న

ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…

9 hours ago