కాదేది ఎగతాళికి అనర్హం అన్నట్టుంది కొందరు నెటిజెన్ల మానసిక స్థాయి. దేశమంతా గర్వపడే స్థాయిలో చంద్రయాన్ 3ని జాబిల్లి మీదకు పంపిన శాస్త్రవేత్తల విజయాన్ని అందరూ సెలెబ్రేట్ చేసుకుంటుండగా పని లేని బ్యాచ్ మాత్రం కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రోగ్రాంని పెట్టుకుంది. ఈ మొత్తం ప్రయోగానికి అయిన ఖర్చు సుమారుగా 615 కోట్ల దాకా ఉంటుందని, ఇంత తక్కువ మొత్తంతో ఎలా సాధ్యం చేశామో బయటికి చెబితే ఇతర దేశాలు కాపీ కొడతాయని, అందుకే గుట్టుగా ఉంచుతామని ఒక సైంటిస్ట్ అన్న మాటలు మీడియాతో పాటు అన్ని మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.
ఆదిపురుష్ బడ్జెట్ ఆరు వందల కోట్లని రిలీజ్ కు ముందు నిర్మాతలు చెప్పుకున్న సంగతి తెలిసిందే. అలాంటి అవుట్ ఫుట్ కి అంత ఖర్చు పెట్టడం కన్నా చంద్రయాన్ లాంటి వాటికి సొమ్ములిస్తే ప్రగతికి ఉపయోగపడుతుందని కొందరు ట్రోలింగ్ మొదలుపెట్టారు. రామాయణానికి మచ్చ తెచ్చే సినిమాల కన్నా సైన్స్ ఎక్స్ పరిమెంట్లే నయమని వాళ్ళ అభిప్రాయం. అయినా మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్టు ఇదేం లాజిక్కు అర్థం కావడం లేదు. ఈ లెక్కన అసలు జనం సినిమాలు చూడటమే మానేస్తే కొన్ని వందల కోట్లు ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడతాయిగా.
మరీ విడ్డూరం కాకపోతే వెళ్ళిపోయిన సినిమాని మళ్ళీ ఎందుకు తవ్వుతున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆదిపురుష్ ప్రైమ్ లో వచ్చాక కూడా విమర్శలు వచ్చాయి కానీ మరీ భయపడే స్థాయిలో ఎవరూ విరుచుకుపడలేదు. అసలు చూడకూడదని లైట్ తీసుకున్నవాళ్ళే ఎక్కువ. ఇంత జరిగినా ఆ ఓటిటి ప్లాట్ ఫార్మ్ లో ఆదిపురుష్ ట్రెండింగ్ ఉన్న మాట వాస్తవం. అయినా ఒక చారిత్రక ఘట్టాన్ని ఇలా సినిమాల బడ్జెట్ తో ముడిపెట్టడం చూస్తే భవిష్యత్తులో కల్కి 2898, సలార్, దేవర లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ మీద ఇంకెంత టార్గెట్ చేసుకుంటారో ఊహించడం కష్టమే.
This post was last modified on August 24, 2023 10:01 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…