‘తానాజీ’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ప్రభాస్ నేరుగా బాలీవుడ్‍లో అడుగుపెడుతున్నాడు. బాహుబలి, సాహో సినిమాలతో ప్రభాస్‍కి దేశవ్యాప్తంగా గ్యారెంటీ మార్కెట్ వుందని తేలడంతో ‘ఆదిపురుష్’ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో విలన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. కానీ ఓం రౌత్ గత చిత్రం ‘తానాజీ’లో విలన్‍గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఇందులోను విలన్‍గా నటించనున్నాడని సమాచారం. రావణుడి పాత్ర కోసం సైఫ్ తన ఆకారాన్ని మార్చుకోనున్నాడట. హీరోగా సైఫ్ నటిస్తోన్న సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో అతను వెబ్ సిరీస్‍ల వైపు వెళ్లిపోయాడు.
అలాంటి టైమ్‍లో ‘తానాజీ’తో సైఫ్‍కి పెద్ద హిట్ ఇచ్చాడు ఓం రౌత్. అతడే ప్రభాస్‍కి కూడా విలన్‍గా నటిస్తే బాగుంటుందని ఓం భావిస్తున్నాడట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం వస్తుందని అంటున్నారు. ఇక సీతగా నటించే హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి కథానాయికగా ఎంపిక కానుంది.
This post was last modified on August 20, 2020 12:02 am
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……