భారతీయ చరిత్రలో మరో సువర్ణాధ్యాయం లిఖించారు మన శాస్త్రవేత్తలు. అగ్ర దేశాలు సైతం ఎంతో ప్రయత్నించి విఫలమైన జాబిల్లి దక్షిణ ధృవంపై చంద్రయాన్ 3ని విజయవంతంగా లాంచ్ చేసి కోట్లాది దేశ ప్రజల కళ్ళలో ఆనందాన్ని నింపారు. సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకు సాధించిన ఈ ఘనత చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్స్ అందరూ స్వీట్లు పంచుకుంటూ, బాణాసంచా కాల్చుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాలుగేళ్ల క్రితం విఫలమైన ఈ ప్రయోగం మన సైంటిస్టుల పట్టుదల వల్ల ఈరోజు సాకారమై గర్వకారణంగా నిలిచింది
ఇదంతా సరే కానీ ఇప్పుడీ అద్భుత ఘటాన్ని సినిమాగా తీస్తారా అనే ప్రశ్న ముఖ్యంగా బాలీవుడ్ వర్గాల్లో మొదలైపోయింది. అక్షయ్ కుమార్ ఇలాంటి సంఘటనలు, బయోపిక్కులు తీయడంలో ముందు వరసలో ఉంటాడు. మిషన్ మంగళ్, ప్యాడ్ మ్యాన్, ఎయిర్ లిఫ్ట్, టాయిలెట్, కేసరి, సామ్రాట్ పృథ్విరాజ్ వగైరాలన్నీ నిజ జీవితాల ఆధారంగా తీసినవే. కొన్ని ఆడాయి, కొన్ని పోయాయి. ఇప్పుడీ చంద్రయాన్ 3 గురించి తెలిశాక వెంటనే వీటికి కారణం ఎవరు, 41 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో ఎవరెవరు భాగమయ్యారు లాంటివన్నీ రీసెర్చ్ చేసి మరీ రచయితలతో స్క్రిప్ట్ రాయించుకుంటారేమో.
ఇతను కాకపోతే దగ్గర్లో ఎవరో ఒకరు చంద్రయాన్ 3ని తెరకెక్కించడం ఖాయం. బిజెపి వైపు నుంచి ఎలాగూ ఈ తరహా వాటికి మద్దతు పుష్కలంగా ఉంటుందనేది ఇండస్ట్రీలో బహిరంగంగా మాట్లాడుకునే సీక్రెట్. అలాంటప్పుడు ఇంత గొప్ప విజయాన్ని స్క్రీన్ మీద చూపిస్తామంటే ఖచ్చితంగా సహకారం అందిస్తుంది. అయితే ఇలాంటివి డ్రామా లేకుండా పండించడం కష్టం. తెలుగులో కొన్నేళ్ల క్రితం వరుణ్ తేజ్ తో దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఇదే తరహాలో అంతరిక్షం తీస్తే ఆశించిన విజయం సాధించలేదు. అందుకే వేరొకరు స్పేస్ కథల జోలికి వెళ్ళలేదు. మరి చంద్రయాన్ తీసే సాహసికుడు ఎవరో చూద్దాం.
This post was last modified on August 23, 2023 9:19 pm
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…