ఖుషి ప్రమోషన్ల కోసం రాష్ట్రాలు తిరుగుతున్న విజయ్ దేవకొండకు అక్కడి మీడియా నుంచి ఇరికించే ప్రశ్నలు ఎదురవుతున్నా చాలా తెలివిగా పరిణితితో సమాధానం ఇస్తున్న తీరు బాగా వైరలవుతోంది. ప్రెస్ మీట్ లో భాగంగా ఒక కోలీవుడ్ జర్నలిస్ట్ నీకు తమిళ దర్శకులు లోకేష్ కనగరాజ్, వెట్రిమారన్ తప్ప మిగిలినవాళ్ల గురించి అంతగా తెలియదు కదానే రీతిలో చురక లాంటి క్వశ్చన్ వేశాడు. నిజానికి ఇతర భాషలకు సంబంధించిన డైరెక్టర్ల గురించి తెలుసుకునేంత అవగాహన, ఓపిక స్టార్లకు ఉండదు. కానీ రౌడీ హీరో తాను అలాంటి టైపు కాదని కెమెరా సాక్షిగా కుండబద్దలు కొట్టాడు.
సదరు విలేఖరికి సమాధానమిస్తూ నేను అరుణ్ ప్రభుని చాలా ఇష్టపడతానని, అతనెవరో నీకైనా తెలుసా అంటూ రివర్స్ లో ప్రశ్న అడిగే సరికి అవతలి వ్యక్తి నీళ్లు నమిలాడు. దానికి విజయ్ దేవరకొండ కొనసాగిస్తూ అరువి లాంటి అద్భుత చిత్రం తీసింది అతనేనని, తర్వాత వాజి అనే మరో మూవీ కూడా ఇచ్చాడని చెప్పడంతో చప్పట్లు వినిపించాయి. అంతే కాదు శ్రీకార్తిక్ ప్రస్తావనతో పాటు ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ తీస్తున్న అరుణ్ మాతేశ్వరన్ ని గుర్తు చేయడంతో ఆపై అక్కడ సౌండ్ బంద్. దీన్ని బట్టి విజయ్ ఎప్పటికప్పుడు పక్క లాంగ్వేజెస్ సినిమాల మీద ఓ కన్నేశాడని అర్థమైపోయింది.
అతను ఏ ఉద్దేశంతో అడిగినా విజయ్ బదులు చెప్పిన తీరు ఫ్యాన్స్ మధ్య బాగా తిరుగుతోంది. ఖుషి ప్యాన్ ఇండియా మూవీ కానప్పటికీ అందరికీ కనెక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో మల్టీ వెర్షన్లు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో డియర్ కామ్రేడ్, లైగర్ లాంటి వాటితో తమిళంలో చేదు అనుభవాలు ఎదురుకున్న విజయ్ దేవరకొండ ఈసారి పూర్తిగా ఫ్యామిలీ అండ్ యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేయడంతో గీత గోవిందంని మించిన సక్సెస్ ఖాయమని నమ్ముతున్నాడు. రెండు గంటల నలభైఐదు నిమిషాల నిడివితో యు/ఏ తెచ్చుకున్న ఖుషికి చికిత్స కోసం యుఎస్ వెళ్లిన సమంతా అక్కడా ప్రమోట్ చేయడం విశేషం.
This post was last modified on August 23, 2023 4:59 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…