తెలుగులో మంచి అభిరుచి ఉన్న సీనియర్ నిర్మాతల్లో శివలెంక కృష్ణప్రసాద్ ఒకరు. ఇప్పుడు చూసినా అడ్వాన్స్డ్‌గా అనిపించే ‘ఆదిత్య 369’ లాంటి చిత్రాన్ని 90వ దశకంలో భారీ బడ్జెట్ పెట్టి తీసి సాహసోపేత నిర్మాత ఆయన. మధ్యలో కొన్నేళ్లు ప్రొడక్షన్ ఆపేసిన ఆయన.. తర్వాత జెంటిల్‌మ్యాన్, సమ్మోహనం, యశోద లాంటి చిత్రాలతో మళ్లీ తన అభిరుచిని చాటారు. చివరగా ఆయన్నుంచి వచ్చిన ‘యశోద’ మంచి ఫలితాన్నే అందించింది.
తర్వాత తన ప్రొడక్షన్లో కొత్త సినిమా కోసం సన్నాహాలు చేసుకుంటూనే.. ఓ అనువాద చిత్రాన్ని తెలుగులో అందించడానికి సిద్ధమయ్యారు శివలెంక కృష్ణప్రసాద్. శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తమిళంలో ‘800’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎం.ఎస్.శ్రీపతి అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ ‘800’ను నిర్మించింది.
ఈ సినిమాను తమిళంలో నిర్మాణ సంస్థే రిలీజ్ చేస్తుండగా… తమిళనాడు మినహా ఆల్ ఇండియా రైట్స్‌ను శివలెంక కృష్ణప్రసాద్ తీసుకున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ చిత్రాన్ని ఆయన రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని అనేక దేశాల్లో భారీ ఖర్చుతో చిత్రీకరించారు. మురళీధర్ లంకేయుడే అయినా అతడికి తమిళ మూలాలున్నాయి. అతడి భార్యది కూడా చెన్నైయే. నిజానికి ‘800’ సినిమాను అనౌన్స్ చేసినపుడు మంచి క్రేజ్ కనిపించింది.
అందుక్కారణం.. మురళీ పాత్రను విజయ్ సేతుపతితో చేయించాలనుకోవడమే. కానీ ఫస్ట్ లుక్ రిలీజయ్యాక మురళీధరన్ పాత్రను సేతుపతి చేయడం పట్ల తమిళుల నుంచే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మురళీధరన్ తమిళుల కోసం ఎప్పుడూ మాట్లాడలేదని.. అలాంటి తమిళ ద్రోహి పాత్రలో నటించడం ఏంటని సేతుపతిని ప్రశ్నించారు. దీంతో అతను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు.
ఆ పాత్రను ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ పోషించాడు. ఐతే మురళీధరన్ జీవితంలో ఎన్ని మలుపులున్నప్పటికీ.. అతనో విదేశీ క్రికెటర్. అతడి పాత్ర పోషించిన నటుడికి ఎలాంటి ఇమేజ్ లేదు. ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులైనా.. మిగతా ఆడియన్స్ అయినా ఏమాత్రం ఆదరిస్తారో చూడాలి. ఇలాంటి సినిమాను కొనుక్కుని కృష్ణప్రసాద్ తన అభిరుచిని చాటినా.. ఆయనకు ఆర్థికంగా ఈ సినిమా ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుందో చూడాలి.
This post was last modified on August 23, 2023 4:53 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…