ఒకప్పుడు సినిమాలు చాలా వరకు రెండున్నర గంటలు, అంత కంటే ఎక్కువ నిడివితోనే ఉండేవి. అంత కంటే తక్కువ నిడివితో ఒక కథను చెప్పడం కష్టమన్నట్లు ఉండేవాళ్లు ఫిలిం మేకర్స్. కానీ గత దశాబ్ద కాలంలో ఈ ఆలోచన మారింది. పాటలు, ఫైట్లు లాంటివి తగ్గించి.. 2-2:30 గంటల మధ్య నిడివితో సినిమాలు తీయడం పెరిగింది. ఇంతకుముందులా ప్రేక్షకులు ఓపికతో రెండున్నర గంటలకు పైగా థియేటర్లలో కూర్చునే పరిస్థితి లేకపోవడంతో.. లెంగ్త్ పెరిగితే ‘ల్యాగ్’ అన్న కంప్లైంట్లు పెరిగిపోవడం ఇందుకు కారణం.
ఐతే మంచి బిగువుతో కథలు చెబితే నిడివి అనేది పెద్ద సమస్య కాదని చాలా సినిమాలు రుజువు చేశాయి. అర్జున్ రెడ్డి, రంగస్థలం సహా చాలా చిత్రాలు దాదాపు 3 గంటల నిడివితోనే ఆకట్టుకున్నాయి. ఈ మధ్యే ‘బేబీ’ అనే చిన్న సినిమా సైతం అంతే నిడివితో ప్రేక్షకులను మెప్పించింది. దీంతో ఫిలిం మేకర్స్‌లో ధైర్యం వస్తోంది. రాబోయే రోజుల్లో ఇలాంటి ‘పెద్ద’ సినిమాలు మరిన్ని రాబోతున్నాయి.
ఈ గురువారం రిలీజ్ కాబోెతున్న దుల్కర్ సల్మాన్ సినిమా ‘కింగ్ ఆఫ్ కోతా’ నిడివి 2 గంటల 56 నిమిషాలు కావడం విశేషం. ఇదొక గ్యాంగ్‌స్టర్ డ్రామా. అనామకుడిగా మొదలై పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా మారిన ఒక వ్యక్తి కథను డీటైల్డ్‌గా చూపించబోతున్నారిందులో. ఇలాంటి సినిమాలు మామూలుగానే ఎక్కువ నిడివితో ఉంటాయి. ఇక సెప్టెంబరు 1న రిలీజయ్యే ‘ఖుషి’ సినిమా నిడివి కూడా కాస్త ఎక్కువే. ఆ చిత్రాన్ని 2 గంటల 45 నిమిషాల రన్ టైంతో రిలీజ్ చేయబోతున్న విషయం వెల్లడైంది.
తాను చెబుతున్న ప్రేమకథలో మంచి ఫీల్ ఉంది కాబట్టి నిడివి సమస్య కాదని శివ నిర్వాణ ధీమాగా ఉన్నాడు. ఇక ఆ తర్వాతి వారం రిలీజ్ కానున్న షారుఖ్ ఖాన్ సినిమా ‘జవాన్’ నిడివి 2 గంటల 50 నిమిషాలు కావడం గమనార్హం. ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అంత సేపు ఎలా కూర్చోబెడుతుందో చూడాలి. ఇక సెప్టెంబరు 28న రిలీజయ్యే ప్రభాస్ మూవీ ‘సలార్’ సైతం 3 గంటల నిడివితో రాబోతోంది. అలాంటి మాస్ సినిమా అంత రన్ టైంతో రావడం ఆశ్చర్యం కలిగించేదే. మరి ఈ ‘పెద్ద’ సినిమాలను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
This post was last modified on August 23, 2023 11:59 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…