టాలీవుడ్ కే కాదు ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ ప్యాన్ వరల్డ్ మూవీగా అంచనాలు ఆకాశాన్ని దాటుతున్న కల్కి 2898 ఏడికి ప్రమోషన్ విషయంలో నాగ అశ్విన్ తీసుకుంటున్న శ్రద్ధ మంచి ఫలితాలను ఇస్తోంది. మాములుగా ప్రభాస్ నిర్మాతలు ఏదీ టైంకి పాటించరనే నిందను తొలగిస్తూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో టచ్ లో ఉండేలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. టీజర్ తర్వాత ఫీడ్ బ్యాక్ చదివి మరీ ఎక్కడ తప్పులు జరిగాయో విశ్లేషించుకుంటున్నామని చెప్పడం నెటిజెన్లకు బాగా రీచ్ అయ్యింది. ఈసారి చిరంజీవి పుట్టినరోజు సందర్భాన్ని వాడేసుకున్నారు.
ఎడిటింగ్ రూమ్ లో తీసిన ఒక చిన్న వీడియో బిట్ ని కోట్ చేస్తూ మెగాస్టార్ కి బర్త్ డే విషెస్ తెలియజేసారు. గ్యాంగ్ లీడర్ లో మంటలు చిమ్ముతున్న వెల్డింగ్ రాడ్ తో గాగుల్స్ పెట్టుకున్న చిరు ఫ్రేమ్ ఒకటి ఐకానిక్ షాట్ గా మిగిలిపోయింది. అచ్చం అదే తరహాలో అనిపించే సీన్ లో ప్రభాస్ అలాగే చేయడాన్ని చూపిస్తూ స్పెషల్ షాక్ ఇచ్చారు. ఇంటర్వ్యూలో చిరు పట్ల తన ఫ్యానిజంని ప్రత్యేకంగా చెప్పుకునే అశ్విన్ కల్కిలో ఈ రూపంలో వాడుకున్నాడన్న మాట. వైజయంతి మూవీస్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా దీన్ని పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయ్యింది.
సరే ఉద్దేశం ఏదైతేనేం కల్కిలో కొత్త బిట్ చూశామని డార్లింగ్ అభిమానులు సంబరపడుతున్నారు. వచ్చే నెల 28న సలార్ విడుదల ఉన్న నేపథ్యంలో దాని తర్వాత వచ్చే సినిమాగా కల్కి మీద మాములు హైప్ లేదు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, అనుపమ్ ఖేర్, దిశా పటానిలతో కలిసి ప్రభాస్ చేయబోయే సోషియో ఫాంటసీ రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందోనని తలుచుకుని ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. 2024 జనవరి 12 ముందు విడుదల తేదీగా ప్రకటించారు కానీ నిజంగా ఆ డేట్ కి కట్టుబడి ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి. మొత్తానికి మెగా సర్ప్రైజ్ అయితే బాగుంది
This post was last modified on August 22, 2023 10:10 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…