Movie News

ఖుషీకి అంత నిడివి రిస్క్ అవుతుందేమో

ఇంకో తొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న ఖుషి సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. ముందు అఫ్ ది రికార్డు దీనికి క్లీన్ యు వచ్చిందని కొందరు యూనిట్ సభ్యులు అన్నారు కానీ వాస్తవానికి యు/ఏ తెచ్చుకుంది. అంటే పెద్దల పర్యవేక్షణలో పిల్లలు చూడాల్సిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయన్న మాట. ఇక లెన్త్ విషయానికి వస్తే ఖుషి ఫైనల్ కట్ 2 గంటల 45 నిమిషాలకు లాక్ చేశారు. మాములుగా లవ్, రొమాంటిక్, ఎమోషనల్ డ్రామాలకు ఇది ఎక్కువే. చాలా బలమైన కంటెంట్ ఉంటే తప్ప ఆడియన్స్ అంతసేపు థియేటర్లలో కూర్చునేందుకు సుముఖంగా లేరు.

అలాంటిది దర్శకుడు శివ నిర్వాణ ఇంత డిసైడ్ చేశారంటే ఏదో ప్రత్యేక కారణం ఉండే ఉంటుంది. దేవుడిని నమ్మని ఒక నాస్తికుడి కొడుకు, తెల్లారితే మొదలు దైవ ధ్యానం తప్ప మరో ప్రపంచం తెలియని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయికి మధ్య జరిగే లవ్ స్టోరీగా ఖుషిని రూపొందించారు. హేశం అబ్దుల్ వహాబ్ పాటలు మ్యూజిక్ లవర్స్ కు బాగానే చేరాయి. అయితే నిడివి విషయంలో రాజీ పడకపోవడం వల్ల గతంలో నాని అంటే సుందరానికి ఎంత డ్యామేజ్ అయ్యిందో ఫ్యాన్స్ మరిచిపోలేదు. ట్రిమ్ చేసి ఉంటే మెరుగైన ఫలితం దక్కేదని ఇప్పటికీ అనుకుంటారు

మరి ఖుషి మేకర్స్ ప్లానింగ్ ప్రకారమే ఈ డ్యూరేషన్ కి సిద్దపడ్డారా లేక చూద్దాం ఒక ట్రయల్ వేద్దామని ఓకే అన్నారా వేచి చూస్తే కానీ అర్థం కాదు. సమంతకు శాకుంతలం పెద్ద షాక్ ఇచ్చాక ఆశలన్నీ దీని మీదే పెట్టుకుంది. చికిత్స కోసం ఏడాది వరకు గ్యాప్ తీసుకోనుంది కాబట్టి ఖుషి బ్లాక్ బస్టర్ అయితే తిరిగి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈ ఫలితం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం తను యుఎస్ లో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ పబ్లిసిటీ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టాక్ పాజిటివ్  గా వస్తే కనక కనీసం రెండు వారాలు బలమైన రన్ దక్కుతుంది. లైగర్ గాయం మర్చిపోయేందుకు విజయ్ కు ఇది చాలా అవసరం.

This post was last modified on August 22, 2023 6:15 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

5 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

5 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

6 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

6 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

7 hours ago