‘సలార్’ సినిమాలో ప్రభాస్‌ను డైనోసర్‌గా అభివర్ణిస్తూ ఇచ్చిన ఎలివేషన్ చూసి అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులకు పూనకాలు వచ్చేశాయి. అప్పట్నుంచి ప్రభాస్‌ను డైనోసర్ అనే అంటున్నారు సోషల్ మీడియా జనాలు. ‘సలార్’ సినిమాకు జరుగుతున్న బిజినెస్.. దాని రిలీజ్ రేంజ్ చూసి ప్రభాస్ నిజంగా డైనోసరే అంటూ అభిమానులు కొనియాడుతున్నారు.
ఈ సినిమా విడుదలకు ఇంకా ఐదు వారాల సమయం ఉండగానే యుఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోగా.. వాటికి వస్తున్న రెస్పాన్స్ చూసి ట్రేడ్ పండిట్లు షాకవుతున్నారు. యుఎస్‌లోని కొన్ని లొకేషన్లలో తాజాగా బుకింగ్స్ మొదలు పెట్టగా. కొన్ని గంటల్లోనే వేల టికెట్లు తెగాయి. ఆల్రెడీ గ్రాస్ 50 వేల డాలర్లను దాటేసింది. యుఎస్‌లో ఇండియన్ సినిమాల చరిత్రలోనే అత్యధిక లొకేషన్లు, స్క్రీన్లలో ‘సలార్’ రిలీజవుతున్న సంగతి తెలిసిందే.
ప్రత్యంగిర సినిమాస్ ‘సలార్’ సినిమా ఉత్తర అమెరికా హక్కులను దక్కించుకుంది. ఆ సంస్థ ఏకంగా 1979+ స్క్రీన్లలో రిలీజ్ చేయబోతున్నట్లు గత నెలలోనే అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇండియన్ సినిమాల్లో ఇది బిగ్గెస్ట్ ఎవర్ రిలీజ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రిలీజ్ టైంకి స్క్రీన్ల సంఖ్య ఇంకా పెరిగినా పెరగొచ్చు. ‘బాహుబలి’ తర్వాత ప్రబాస్ కెరీర్లో అత్యంత హైప్‌తో వస్తున్న సినిమా ‘సలార్’యే.
‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసిన సినిమా కావడం.. ప్రభాస్ కటౌట్‌కు తగ్గ పక్కా మాస్ బొమ్మ కావడంతో ‘సలార్’ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని భావిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మరోవైపు సెప్టెంబరు 7న రాబోతున్న షారుఖ్ ఖాన్ సినిమా ‘జవాన్’కు కూడా యుఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరుగుతున్నాయి. ‘పఠాన్’ సినిమాతో తాను నెలకొల్పిన రికార్డులనే షారుఖ్ అధిగమించబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on August 22, 2023 3:22 pm
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…