మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు మంగళవారం. మామూలుగా పెద్ద హీరోల పుట్టిన రోజులంటే అప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమాల నుంచి ఏవైనా కొత్త విశేషాలు పంచుకుంటారేమో అని ఎదురు చూస్తారు అభిమానులు. ఐతే చిరు కొత్త సినిమాలేవీ షూటింగ్ దశలో లేవు. దీంతో కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఐతే ఈ విషయంలో సస్పెన్స్ నడుస్తోంది. ‘భోళా శంకర్’ హిట్టయి ఉంటే.. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అనుకున్న.కొత్త సినిమా ప్రకటన కచ్చితంగా ఉండేదే.
ముహూర్త వేడుక కూడా చేసి ఉన్నా ఆశ్చర్యం లేదు. కానీ ‘భోళా శంకర్’ దారుణమైన ఫలితాన్ని అందుకోవడంతో దాని లాగే రీమేక్ అయిన కొత్త సినిమా విషయంలో సందిగ్ధత నెలకొంది. స్క్రిప్టు మీద మళ్లీ పని చేస్తున్నారని.. అలాగే కళ్యాణ్ కృష్ణను తప్పించి మురుగదాస్‌ను దర్శకుడిగా తీసుకొస్తున్నారని రకరకాల ప్రచారాలు జరిగాయి.
కానీ మురుగదాస్ ఈ ప్రాజెక్టులోకి రావడం అన్నది అబద్ధం అని తెలుస్తోంది. కళ్యాణ్ కృష్ణే తన టీంతో కలిసి మళ్లీ స్క్రిప్టు మీద పని చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరు స్క్రిప్టుకు ఓకే చెప్పాకే సినిమా అనౌన్స్‌మెంట్ ఉండొచ్చంటున్నారు. కాబట్టి చిరు పుట్టిన రోజుకు ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సందేహమే అంటున్నారు.
కాగా ఈ చిత్రం తర్వాత ఉంటుందనుకున్న వశిష్ఠ మూవీ గురించి ఇప్పుడో ఆసక్తికర కబురు వినిపిస్తోంది. యువి క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు అన్నీ ఓకే అయిపోయాయని.. ప్రి ప్రొడక్షన్ పనులు కొన్ని నెలల పాటు జరగనుండటంతో సినిమా పట్టాలెక్కడానికి సమయం పడుతుందని.. ఐతే చిరు పుట్టిన రోజుకు ఒక మోషన్ పోస్టర్ లాంటిది రిలీజ్ చేసి సినిమాను అనౌన్స్ చేయబోతున్నారని అంటున్నారు. చూద్దాం మరి మెగా బర్త్‌డేకి ఏం విశేషం ఉంటుందో?
This post was last modified on August 21, 2023 11:58 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…