వచ్చే వారం తన పుట్టినరోజు సందర్భంగా నాగార్జున కొత్త సినిమా మొదలుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా వ్యవహరించబోయే ఈ విలేజ్ ఎంటర్ టైనర్ షూటింగ్ ని ఏకధాటిగా జరపాలని ప్లాన్ చేసుకున్నారట. సంక్రాంతి రేసులో పెట్టాలని నాగ్ ఖచ్చితంగా చెప్పడంతో దానికి అనుగుణంగానే షెడ్యూల్స్ ని సిద్ధం చేయబోతున్నట్టు తెలిసింది. సెప్టెంబర్ మూడు నుంచి బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలవుతోంది. వారాంతం దానికి డేట్స్ ఇస్తూనే రెండు బ్యాలన్స్ చేయాల్సిన ఒత్తిడి ఉంటుంది.
అసలే పండక్కు విపరీతమైన పోటీ ఉంది. గుంటూరు కారం ఇంకా చాలా బాలన్స్ ఉన్నా హీరో మహేష్ బాబు, నిర్మాత నాగవంశీ జనవరి 12 విడుదల ఖాయమని నిన్న మళ్ళీ నొక్కి వక్కాణించారు. త్రివిక్రమ్ ఆధ్వర్యంలో చిత్రీకరణ జరుగుతోంది. రవితేజ ఈగల్ వెనక్కు తగ్గే సమస్య లేదని మాస్ మహారాజా వర్గాలు అంటున్నాయి. కీలకమైన ఈ సీజన్ అయితేనే తమ ప్యాన్ ఇండియా మూవీకి న్యాయం జరుగుతుందని ప్రశాంత్ వర్మ బృందం హనుమాన్ ని రెడీ చేస్తోంది. విజయ్ దేవరకొండ పరశురామ్ ల కాంబో మూవీని సైతం అదే సమయంలో దింపాలని నిర్మాత దిల్ రాజు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
వీటి మధ్య నాగ్ తన గలాటా (ప్రచారంలో ఉన్న టైటిల్)ని రిలీజ్ చేయడం చాలా సమీకరణాలకు లోబడాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రాజెక్ట్ కె డ్రాప్ అనుకున్నా పైన చెప్పినవన్నీ భారీ చిత్రాలే. సోగ్గాడే చిన్ని నాయనా టైంలో నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, ఎక్స్ ప్రెస్ రాజా పోటీని తట్టుకుని గెలిచిన పరిస్థితులకు ఇప్పటికి చాలా మార్పు ఉంది. ఆలా కాకుండా జనవరి చివర్లో వస్తే కలిగే ప్రయోజనం ఎక్కువ. మరి రాబోయే రోజుల్లో నిర్ణయం ఏమైనా మార్చుకుంటారేమో చెప్పలేం. ప్రస్తుతానికి ఆగస్ట్ 29 వదిలే టీజర్ లో రిలీజ్ డేట్ సంక్రాంతిదే ఉంటుందని విశ్వసనీయ సమాచారం. చూద్దాం ఏం చెప్తారో.
This post was last modified on August 21, 2023 6:35 pm
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…