Movie News

‘బాహుబలి’ని టచ్ చేసే ఛాన్స్ లేదు

ఇండియన్ సినిమాలో బడ్జెట్లు, పారితోషకాలు, వసూళ్లు.. ఇలా ప్రతి విషయంలోనూ దశాబ్దాలుగా బాలీవుడ్ పేరిటే రికార్డులన్నీ ఉండేవి. వాటి ముందు ప్రాంతీయ భాషా చిత్రాలు చిన్న స్థాయిలో కనిపించేవి. కానీ ఎనిమిదేళ్ల ముందు మొత్తం కథ మారిపోయింది. ‘బాహుబలి’ సినిమాకు పెట్టిన బడ్జెట్, వచ్చిన వసూళ్లు చూడా బాలీవుడ్ నివ్వెరబోయింది. ‘బాహుబలి: ది బిగినింగ్’ అప్పట్లోనే రూ.600 కోట్లకు దాకా వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది.

ఇక దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘బాహుబలి: ది కంక్లూజన్’ అయితే పాత రికార్డులను తిరగరాయడం కాదు.. సమీప భవిష్యత్తులో ఆ సినిమా వసూళ్లను అందుకోవడం గురించి ఎవరూ ఆలోచించలేని పరిస్థితి కల్పించింది. ‘బాహుబలి-2’ వరల్డ్ వైడ్ రూ.1700 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. చైనా వసూళ్లను కలపడం వల్ల ‘దంగల్’ దాన్ని దాటింది కానీ.. ఇండియా వరకు ఇప్పటికీ ‘బాహుబలి’దే ఆధిపత్యం.

ఆరేళ్ల కిందటే కేవలం మన దేశం వరకే రూ.1300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఘనత ‘బాహుబలి-2’ సొంతం. స్వయంగా రాజమౌళి సైతం ‘ఆర్ఆర్ఆర్’తో ఈ వసూళ్లను అధిగమించలేకపోయాడు. కేజీఎఫ్-2, పఠాన్ లాంటి సినిమాలు కూడా ప్రయత్నించి విఫలమయ్యాయి. హిందీ వరకు చూసుకున్నా సరే.. బాలీవుడ్ భారీ చిత్రాలు సైతం ‘బాహుబలి-2’ను అధిగమించలేకపోతుండటం గమనార్హం.

‘బాహుబలి’ హిందీ వెర్షన్ మాత్రమే అప్పట్లోనే రూ.720 కోట్ల గ్రాస్, రూ.515 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. పఠాన్ ఎంత కష్టపడ్డా దీని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. ఇప్పుడు ‘గదర్-2’.. బాహుబలి-2 రికార్డులను టార్గెట్ చేసింది కానీ దానికి కూడా ఆ ఘనతను అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. రెండో వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం రూ.375 కోట్ల నెట్, రూ.500 కోట్లకు చేరువగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక్కడి నుంచి వసూళ్లు కచ్చితంగా తగ్గుతాయనడంలో సందేహం లేదు. ఇంకో వంద కోట్ల నెట్ వసూళ్లు రాబట్టడం కూడా కష్టమయ్యే పరిస్థితుల్లో ‘బాహుబలి’ని టచ్ చేయడం కష్టమే కావచ్చు.

This post was last modified on August 21, 2023 6:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప 3 లో యాక్ట్ చేస్తావా? : తిలక్ ఏమన్నాడంటే…

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…

3 hours ago

‘దళపతి విజయ్’ : సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా..

కోలీవుడ్‌లో చిన్న వ‌య‌సులోనే మంచి పేరు సంపాదించుకున్న ద‌ళ‌ప‌తి విజ‌య్‌. విజ‌య్ సినిమాలు.. క్రిటిక్స్‌, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచ‌నాలు…

3 hours ago

అవినాష్‌రెడ్డికి మ‌రో చిక్కు.. ఇక‌, బీటెక్ రెడ్డి వంతు!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్ప‌టికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒక‌వైపు బాబాయి వివేకానంద‌రెడ్డి దారుణ…

6 hours ago

కూట‌మి క‌ల‌కాలం.. తేల్చేసిన చంద్ర‌బాబు!

క్షేత్ర‌స్థాయిలో టీడీపీ నాయ‌కుల‌కు, ఎన్డీయే కూట‌మిలో ఉన్న జ‌న‌సేన‌, బీజేపీ నాయ‌కుల‌కు మ‌ధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…

8 hours ago