మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ నుండి ఫస్ట్ సింగిల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ఈ సినిమాకు సంబందించి మ్యూజిక్ విషయంలో మహేష్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. అందుకే సాంగ్ లేట్ అవుతుందని అంటున్నారు. ఇప్పటికే తమన్ ఫస్ట్ సింగిల్ కోసం రెండు వర్షన్స్ రెడీ చేశాడు. ఇద్దరు సింగర్స్ తో ఓకే ట్యూన్ ను రెండు వర్షన్స్ పాడించాడట.
ఇప్పటికే ప్రోమో కట్ రెడీ అయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే ప్రోమో రిలీజవ్వాలి. కానీ మహేష్ గ్రీన్ సిగ్నల్ కోసం టీం వెయిట్ చేస్తున్నారు. వన్స్ మహేష్ ఓకే అనడమే ఆలస్యం మొదటి సాంగ్ అప్ డేట్ బయటికి వచ్చేస్తుంది. మహేష్ ఫైట్ చేస్తూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మాస్ సాంగ్ ను ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేయబోతున్నారు.
రెండు వర్షన్స్ లో రెండో సింగర్ తో పాడించిన సాంగ్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక్కడి నుండి పెద్దగా బ్రేక్స్ లేకుండా ఘాట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా పక్కా థియేటర్స్ లోకి రానుందని మీ అందరికీ నచ్చుతుందని మహేష్ తాజాగా ఓ ఈవెంట్ లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ అప్ డేట్ టీం ఎప్పుడు చెప్తారో చూడాలి.
This post was last modified on August 21, 2023 2:36 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…