అపోజిషన్ లేకపోవడంతో జైలర్ దూకుడుకి అడ్డుఅదుపు లేకుండా పోతోంది. నిన్న రెండో ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 3 కోట్ల 25 లక్షలకు పైగా షేర్ రాబట్టి టైగర్ కా హుకుంని మరోసారి బాక్సాఫీస్ దద్దరిల్లేలా వినిపించాడు. దీంతో మొత్తం ఇప్పటిదాకా ఏపీ, తెలంగాణకు కలిపి 40 కోట్లకు పైగా షేర్ సాధించిన జైలర్ కేవలం తెలుగు వెర్షన్ ప్రకారం చూసుకుంటే వరల్డ్ వైడ్ ఎనభై కోట్ల గ్రాస్ ని దాటేశాడు. నిన్న చాలా చోట్ల టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. కొత్త రిలీజులకు ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో వాటిని క్యాన్సిల్ చేసి మరీ జైలర్ షోలు వేయడం పలు చోట్ల కనిపించింది.
ఓవరాల్ గా అన్ని భాషలు కలుపుకుని అయిదు వందల కోట్లను దాటేసిన జైలర్ కోలీవుడ్ ఆల్ టైం నెంబర్ వన్ గా నిలిచేందుకు పరుగులు పెడుతోంది. ఒక్క బెంగళూరు నగరంలోనే పదో రోజు ఆరు వందలకు పైగా షోలు గతంలో కెజిఎఫ్ 2కి మాత్రమే వేశారు. మళ్ళీ ఇప్పుడు జైలర్ ఆ ఫీట్ ని సాధించాడు. అయినా సరే టికెట్లు దొరకలేదని పలువురు ట్వీట్లు వేయడం గమనార్హం. గదర్ 2, ఓ మై గాడ్ 2లకు తట్టుకుని మరీ బయట రాష్ట్రాల్లో రజనీకాంత్ ఈ స్థాయిలో రాబట్టడం చూసి ట్రేడ్ నివ్వెరపోతోంది. వీక్ డేస్ లో కొంత స్లో అయినా మరీ తీవ్రంగా డ్రాప్ పర్సెంటేజ్ లేదని చెబుతున్నారు.
ఈ వారం చాలా సినిమాలు రాబోతున్న నేపథ్యంలో వాటి టాక్ జైలర్ వీకెండ్ ని ప్రభావితం చేసేది లేనిది తేలుస్తుంది. గాండీవధారి అర్జున, కింగ్ అఫ్ కొత్త, బెదురులంక 2012, బాయ్స్ హాస్టల్, డ్రీం గర్ల్ 2 వరసగా క్యూ కడుతున్నాయి. వీటిలో ఒకటి రెండు బ్లాక్ బస్టర్ అనిపించుకున్నా రజని మూవీ మీద ప్రభావం పడుతుంది. అయితే ఇవేవి జైలర్ ని ఓవర్ టేక్ చేసేంత మాస్ కంటెంట్ ఉన్నవి కాకపోవడంతో ఫ్యాన్స్ మాత్రం ఇంకో వారం మాదే అంటున్నారు. మొత్తానికి సూపర్ స్టార్ కంబ్యాక్ మాములుగా లేదనే విషయం వసూళ్ల సాక్షిగా ప్రపంచానికి అర్థమైపోయింది.
This post was last modified on August 21, 2023 12:35 pm
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…