ఈ మధ్య మళ్లీ తెలుగులో డబ్బింగ్ సినిమాల హవా నడుస్తోంది. కేజీఎఫ్-2, విక్రమ్, కాంతార, వారసుడు, విడుదల, 2012, బిచ్చగాడు-2.. ఇలా గత ఏడాది వేసవి నుంచి డబ్బింగ్ సినిమాలు చాలానే విజయవంతం అయ్యాయి. ఇటీవలే విడుదలైన రజినీకాంత్ సినిమా ‘జైలర్’ కూడా వసూళ్ల మోత మోగిస్తోంది. ఐతే ఇలాంటి పెద్ద సినిమాలతో పాటు అప్పుడప్పుడూ చిన్న స్థాయి అనువాద సినిమాలకు కూడా తెలుగులో మంచి ఆదరణ ఉంటోంది.
ఈ కోవలో కన్నడ డబ్బింగ్ మూవీ ‘బాయ్స్ హాస్టల్’ తెలుగులో నెక్స్ట్ సెన్సేషన్ అయ్యేలా కనిపిస్తోంది. అందరూ కొత్త వాళ్లు కలిసి చేసిన ఈ చిత్రం ఆల్రెడీ కన్నడలో బ్లాక్‌బస్టర్ అయింది. ఫిలిం మేకింగ్‌లో సరికొత్త ప్రయోగంగా దీన్ని క్రిటిక్స్ కీర్తించారు. యూత్ ఈ చిత్రాన్ని ఎగబడి చూశారు. ఈ చిత్రానికి హైదరాబాద్, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాల సిటీస్‌లో కూడా మంచి ఆదరణ దక్కింది.
ఇప్పుడు ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో తెలుగులోకి ఈ చిత్రాన్ని అనువాదం చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఛాయ్ బిస్కెట్ లాంటి పేరున్న సంస్థలు ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నాయి. ఏదో మొక్కుబడిగా డబ్ చేసి రిలీజ్ చేయడం కాకుండా ఒక స్ట్రెయిల్ మూవీ లాగా దీన్ని అందిస్తున్నారు. ట్రైలర్లో ఆ క్వాలిటీ స్పష్టంగా కనిపించింది. ఒరిజినల్‌లోని ఎసెన్స్ చెడకుండానే.. తెలుగు నేటివిటీకి సరిపోయేలా డబ్బింగ్ చేయించారు.
ట్రైలర్ చూస్తే ఇదొక క్రేజీ రైడ్ లాగా కనిపిస్తోంది. విశేషం ఏంటంటే.. తెలుగు వెర్షన్ కోసం ప్రత్యేకంగా ఒక ట్రాక్ కూడా షూట్ చేశారు. తరుణ్ భాస్కర్, రష్మి గౌతమ్ ఇందులో నటించారు. వాళ్ల ట్రాక్ కూడా క్రేజీగా ఉండేలాగే కనిపిస్తోంది. ప్రమోషన్లు కూడా కొంచెం గట్టిగానే చేసి ఈ నెల 26న కొంచెం పెద్ద స్థాయిలోనే సినిమాను రిలీజ్ చేసేలా కనిపిస్తున్నారు. సినిమా డబ్బింగ్, ప్రమోషన్లన్నీ ఛాయ్ బిస్కెట్ వాళ్లు చూసుకుంటుంటే.. రిలీజ్ వ్యవహారం అన్నపూర్ణ వాళ్లు చూసుకుంటున్నారు. చూస్తుంటే ‘బాయ్స్ హాస్టల్’ చిన్నపాటి సంచలనం రేపేలా కనిపిస్తోంది.
This post was last modified on August 20, 2023 11:15 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…