ఒక్క చిన్న వీడియో తమిళ సూపర్ స్టార్ ని రాత్రికి రాత్రి వైరల్ టాపిక్ గా మార్చేసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని రజనీకాంత్ కలిసిన సందర్భంలో తనకన్నా చాలా చిన్నవారైన సిఎం కాళ్లకు నమస్కరించడం కోలీవుడ్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం 20 సంవత్సరాలు. ఇది ముమ్మాటికీ తప్పేనని కొందరి వాదన. లేదు యోగి స్వతహాగా గొప్ప సన్యాసి కావడమే కాక గోరఖ్ నాథ్ మఠానికి మహంత్ కాబట్టి ఆ గౌరవంతో పాదాభివందనం చేయడం ఎంత మాత్రం తప్పు కాదని మరో వర్గం బల్లగుద్ది చెబుతున్నారు.
ఇక్కడ రెండు వెర్షన్లు కరెక్ట్టే. సాధారణంగా ఉన్నతమైన శ్రేష్ఠమైన వర్గానికి చెందిన వాళ్లకు వయసుతో సంబంధం లేకుండా కాళ్లకు దండం పెట్టడం అన్ని చోట్ల ఉన్నదే. ఉదాహరణకు పూజలు జరిపించే బ్రాహ్మణులు వచ్చినప్పుడు చిన్నా పెద్దా అని తారతమ్యాలు చూసుకోవడం ఉండదు. అది ఆ వర్గానికి ఇచ్చే గౌరవం. రజనీకాంత్ కూడా సిఎంని ఒక యోగిలా చూశారు తప్పించి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిగా కాదు. ఒకవేళ అదే నిజమనుకుంటే స్టాలిన్, కేసీఆర్, జగన్, అరవింద్ కేజ్రీవాల్ లను కలిసినప్పుడంతా పొలోమని పాదాలను తాకరుగా. ఇక్కడ ఎన్నో లెక్కలు ఉంటాయి.
కాబట్టి రజనీకాంత్ చేసింది తప్పా ఒప్పా అనేది ఆయన విచక్షణను సంబందించిన నిర్ణయమే తప్ప దాన్ని వేలెత్తి చూపించడం అనవసరం. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ గట్రా మొదలుపెట్టేశారు. అయినా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదే పనిగా జైలర్ సినిమా చూశారంటే అది రజని స్టామినా. అంత స్థాయి వెయ్యి కోట్లు సాధించామని జబ్బలు చరుచుకున్న కెజిఎఫ్, పఠాన్ లాంటి ప్యాన్ ఇండియా సినిమాల వల్లే కాలేదు. అలాంటిది సూపర్ స్టార్ కు మాత్రమే ఆ గౌరవం దక్కినప్పుడు ఈ ఇష్యూ గురించి ఇంత పోస్ట్ మార్టం అవసరం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates