Movie News

క్రేజీ కుర్రాళ్ళు చేసే హాస్టల్ అల్లరి

కొన్ని వారాల క్రితం రిలీజై కన్నడలో సంచలన విజయం సాధించిన హాస్టల్ హుడుగురు బేకాగిద్దరేని తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో డబ్ చేసి తీసుకొస్తున్నాయి అన్నపూర్ణ స్టూడియోస్, ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్. ఒరిజినల్ వెర్షన్ హైదరాబాద్ లో విడుదలైనప్పుడు సబ్ టైటిల్స్ తో చూసిన వాళ్లకు ఇందులో ఉన్న యూత్ ఫుల్ కంటెంట్ షాక్ ఇచ్చింది. అందుకే వీలైనంత  త్వరగా తెలుగు ఆడియన్స్ కి అందివ్వాలన్న ఉద్దేశంతో ఆగస్ట్ 25న విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ గట్టి నమ్మకంతో థియేటర్లకు తీసుకొస్తున్నారు. ఇవాళ లాంచ్ చేసిన ట్రైలర్ లో కథేంటో సూటిగా చెప్పేశారు.

అదో పెద్ద బాయ్స్ హాస్టల్. వందలాది కుర్రాళ్ళ అల్లరితో నిత్యం మోత మ్రోగిపోతూ ఉంటుంది. సినిమాలు, అమ్మాయిలు, గొడవలు ఇవే ప్రపంచంగా బ్రతుకుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. వార్డెన్ ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా సరే అతని పప్పులేవీ వీళ్ళ ముందు ఉడకవు. అనుకోకుండా ఒక రోజు అతను శవమైపోతాడు. అది కాస్తా నలుగురు అబ్బాయిల మీద పడుతుంది. అసలు సీరియస్ నెస్ అంటేనే తెలియని వీళ్లకు ఇప్పుడీ నేరాన్ని ఎలా దాచి పెట్టాలో అర్థం కాదు. అక్కడి నుంచి మొదలవుతుంది రియల్ హంగామా. ఇంతకీ డ్రామా ఎలా జరిగింది, ఏ మలుపు తిరిగిందనేదే స్టోరీ

మూడున్నర నిముషాలపాటు వీడియోని కట్ చేసిన టీమ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఇక్కడా ఫలితం రిపీట్ అవుతుందన్న నమ్మకం కనిపిస్తోంది. మొత్తం కన్నడ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ యాంకర్ రష్మీ, తరుణ్ భాస్కర్ లతో రీ షూట్ చేసిన కొన్ని సన్నివేశాలు నేటివిటీని పెంచాయి. విరూపాక్ష, మంగళవారం ఫేమ్ అజనీష్ లోకానాధ్ సంగీతం, అరవింద్ ఎస్ కశ్యప్ ఛాయాగ్రహణం క్రేజీగా ఉన్నాయి. కింగ్ అఫ్ కొత్త, గాండీవధారి అర్జున, బెదురులంక 2012తో పోటీ పడబోతున్న బాయ్స్ హాస్టల్ లో మ్యాటరైతే గట్టిగానే ఉంది. యువతకు కనెక్ట్ అయితే వసూళ్ల వర్షం ఖాయమే.

This post was last modified on August 19, 2023 7:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

2 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

3 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

4 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

4 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

5 hours ago