‘జైలర్’ సినిమా చూసిన సగటు ప్రేక్షకులకు ఇందులో ఏమంత ప్రత్యేకత ఉంది అనిపించి ఉంటే ఆశ్చర్యం లేదు. ఈ చిత్రానికి వస్తున్న వసూళ్లకు సినిమాలోని కంటెంట్‌కు పొంతన కుదరట్లేదన్నది వాస్తవం. కథాకథనాలు సాధారణంగానే అనిపించే ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది రజినీ చరిష్మా.. ఎలివేషన్ సీన్లు.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అనే చెప్పాలి.
ఇంత యావరేజ్ కంటెంట్‌తోనే సూపర్ స్టార్ రికార్డుల మోత మోగిస్తుండటం ట్రేడ్ పండిట్లతో సహా అందరికీ షాకింగ్‌గానే ఉంది. గత సినిమాల ఫలితాలను చూసి రజినీ పనైపోయిందన్న వాళ్లందరికీ ‘జైలర్’ వసూళ్ల సునామీ పెద్ద షాకే. నిజానికి పెర్ఫామెన్స్ పరంగా కూడా రజినీ కెరీర్లో స్టాండౌట్‌గా నిలిచే పాత్ర.. పెర్ఫామెన్స్ ‘జైలర్’లో లేవు. ఈ సినిమాలో ఆయన ప్రధానంగా ఏం చేశారు అంటే.. స్లో మోషన్లో నడుచుకుంటూ వచ్చారు అనే చెప్పాలి. ఏ హీరోకైనా ఒక ఇంట్రో సీన్ ఉంటుంది. కానీ ఇందులో రజినీకి ఇంట్రో తరహా సీన్లు లెక్కకు మిక్కిలి ఉన్నాయి.
ఒక ఎపిసోడ్ ముగియడం.. చిన్న బ్రేక్ తీసుకుని రజినీ మళ్లీ స్టైలుగా నడుచుకుంటూ రావడం… వెనుక అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో మోత మోగించేయడం.. ఇదీ వరస. ఐతే వేరే హీరోలకు ఇలా చేస్తే చికాకు పుడుతుంది కానీ.. రజినీ ఎన్నిసార్లు ఇదే చేసినా అభిమానులకు బోర్ కొట్టదు. సగటు మాస్ ప్రేక్షకులకు ఈ సీన్లు కిక్కిస్తాయి. ‘జైలర్’కు రిలీజ్ టైమింగ్ కూడా బాగా కలిసొచ్చి రజినీ చరిష్మానే సినిమాను నిలబెట్టేసింది. సౌత్ ఇండియన్ బాక్సాఫీస్‌లో పది రోజులుగా ‘జైలర్’కు ఎదురే లేదు.
తమిళనాడు.. కేరళ.. కర్ణాటక.. ఇలా ఒక్కో రాష్ట్రంలో తమిళ సినిమాల ఆల్ టైం వసూళ్ల రికార్డులను బద్దలు కొట్టుకుంటూ సాగిపోతోంది ‘జైలర్’. యుఎస్‌లో సైతం ఈ సినిమా 5 మిలియన్ క్లబ్బులోకి అడుగు పెట్టబోతోంది. అక్కడ కూడా రికార్డు ‘జైలర్’దే కాబోతోంది. ఇక ఆ చిత్రం ‘2.ఓ’ పేరిట ఉన్న ఆల్ టైం వసూళ్ల రికార్డును మాత్రమే దాటాల్సి ఉంది. అది కూడా లాంఛనమే అని ట్రెండ్‌ను బట్టి అర్థమవుతోంది. మొత్తానికి రజినీ ఇలా నడుచుకుంటూ వచ్చి అన్ని రికార్డులనూ లేపేశాడంటూ అభిమానులు ఎలివేషన్లు ఇస్తున్నారు.
This post was last modified on August 20, 2023 8:06 am
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…