ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్, నెక్స్ట్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఎనౌన్స్ మెంట్ వచ్చిన ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. మొన్నటి వరకూ బుచ్చి బాబు కొందరు రైటర్స్ తో కలిసి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేసుకున్నాడు. ఇక నుండి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ నెలలోనే సినిమాకి ఆఫీస్ పూజ జరగనుంది. ఆఫీస్ స్టార్ట్ అయ్యాక కాస్టింగ్ ఫైనల్ చేయబోతున్నారు.
ఆ తర్వాత లొకేషన్స్ వేట మొదలు పెట్టనున్నారు. ఇదే నెలలో రెహ్మాన్ తో మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యే ఏ రెహ్మాన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా లాక్ చేసుకున్నరు. రెహ్మాన్ ఆఫీషియల్ గా ఈ విషయం చెప్పేశాడు. ఇలా చకచకా బుచ్చిబాబు పనులు మొదలు పెట్టి రామ్ చరణ్ ఫ్రీ అయ్యే తరణం కోసం చూస్తున్నాడు. వన్స్ శంకర్ ‘గేమ్ ఛేంజర్’ పూర్తవ్వగానే బుచ్చిబాబు సినిమాను మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నాడు చరణ్.
రెహ్మాన్ తో పాటు ఈ సినిమాకు ఇంకా పెద్ద టెక్నీషియన్స్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే వారి డీటైల్స్ కూడా బయటికి రానున్నాయి. మొదటి సినిమాతోనే వంద కోట్ల గ్రాస్ అందుకున్న బుచ్చి బాబు కి చరణ్ సినిమా గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. మరి బంగారం లాంటి ఈ అవకాశాన్ని ఈ కుర్ర దర్శకుడు ఎలా సద్వినియోగం చేసుకుంటాడో ? వేచి చూడాలి.
This post was last modified on August 19, 2023 1:33 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…