సినీ పరిశ్రమలో ప్రతిభకు తోడు అదృష్టం ఉంటేనే ఎవ్వరైనా నిలదొక్కుకోగలరు. ఒక హీరోకు మంచి నటుడిగా పేరు వస్తే సరిపోదు. కాలం కలిసి వచ్చి విజయాలు కూడా దక్కాలి. కానీ కొద్దిమంది మాత్రమే ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు దక్కించుకుంటారు. యువ కథానాయకుడు సంతోష్ శోభన్ ఈ కోవకే చెందుతాడు. ‘వర్షం’ సినిమా తీసిన దివంగత దర్శకుడు శోభన్ తనయుడే ఈ కుర్రాడు.
తండ్రికి టాలీవుడ్లో ప్రభాస్, మహేష్ లాంటి హీరోలతోనే కాక త్రివిక్రమ్, కృష్ణవంశీ లాంటి దర్శకులతో శోభన్‌కు మంచి పరిచయం ఉంది. ఆ పరిచయాలే ఆయన మరణానంతరం కూడా కొడుక్కి ఉపయోగపడుతున్నాయి. బేసిగ్గా సంతోష్ కూడా మంచి నటుడని సహాయ పాత్ర చేసిన ‘గోల్కొండ హైస్కూల్’తోనే అందరికీ అర్థమైంది. ఆ తర్వాత అతను ‘తను నేను’ చిత్రంతో హీరో అయ్యాడు. ఇప్పటిదాకా హీరోగా ఎనిమిది సినిమాల్లో నటించాడు.
కానీ థియేటర్లలో సంతోష్ శోభన్ సినిమాలేవీ ప్రభావం చూపలేకపోయాయి. ఓటీటీలో నేరుగా రిలీజైన ‘ఏక్ మినీ కథ’ మాత్రమే మంచి స్పందన తెచ్చుకుంది. పేపర్ బాయ్, మంచి రోజులొచ్చాయి, లైక్ షేర్ సబ్‌స్క్రైబ్, కళ్యాణం కమనీయం, శ్రీదేవి శోభన్ బాబు, అన్నీ మంచి శకునములే.. ఇలా ప్రతి సినిమా కూడా తేడా కొట్టేసింది. ఇప్పుడు ‘ప్రేమ్ కుమార్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు.
‘జైలర్’తో పాటు పాత సినిమాలైన యోగి, రఘువరన్ బీటెక్ సినిమాల కోసం ఎగబడుతున్న ప్రేక్షకులు ఈ వారం వస్తున్న కొత్త సినిమాలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఐతే సంతోష్ మాత్రం ‘ప్రేమ్ కుమార్’ తనకు బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాడు. ఈ సినిమా రిజల్ట్ ఏమవుతుందో కానీ.. సంతోష్‌కు రెండు పెద్ద బేనర్లలో సినిమాల కమిట్మెంట్లు ఉన్నాయట. యువి క్రియేషన్స్‌తో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ అతడితో సినిమాలు నిర్మించబోతున్నాయట. ఇన్ని ఫ్లాపుల తర్వాత ఇంత పెద్ద బేనర్లలో అవకాశాలు అందుకోవడం అంటే సంతోష్‌కు ఎక్కడో సుడి ఉన్నట్లే.
This post was last modified on August 18, 2023 3:00 pm
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…