Movie News

గీత గోవిందం తర్వాత ఖుషికే దక్కింది

అక్కర్లేని హీరోయిజం, ప్రేమ పేరుతో మితిమీరిన తెంపరితనం పాత్రల నుంచి బయటికి వచ్చి చేసిన సినిమాగా రౌడీ హీరో ఫ్యాన్స్ ఖుషి మీద చాలా పాజిటివ్ గా ఉన్నారు. దానికి తగ్గట్టే మైత్రి చేస్తున్న ప్రమోషన్లు, ఈవెంట్లు క్రమంగా బజ్ ని పెంచుతున్నాయి. ట్రోలింగ్ జరిగినా, సూపర్ అనిపించుకున్నా మొన్న జరిగిన మ్యూజికల్ కన్సర్ట్ కి ఊహించిన దానికన్నా మంచి రెస్పాన్స్ వచ్చింది. మణిరత్నం ప్రభావం గట్టిగా చూపిస్తున్న దర్శకుడు శివ నిర్వాణ థియేటర్లకు జంటగా వచ్చినా ఒంటరిగా వచ్చినా మర్చిపోలేని జ్ఞాపకాలను ఇస్తానని హామీ ఇస్తున్నారు. తాజాగా ఖుషి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

సిబిఎఫ్సి అధికారులు ఖుషికి క్లీన్ యు ఇచ్చారట. విజయ్ దేవరకొండ కెరీర్ లో ఇలా అందుకున్న రెండో సినిమా ఇదే. మొదటిది గీత గోవిందం. మిగిలినవన్నీ అయితే ఏ లేదా యు/ఏ తెచ్చుకున్నవే. ఈ లెక్కన ఇందులో ఎలాంటి అసభ్య సీన్లు, లిప్ లాక్ కిస్సులు, బెడ్ రూమ్ రొమాన్సులు కాని ఉండవని అర్థమైపోయింది. నిజానికీ స్టోరీలో వాటికి స్కోప్ ఉంది. కథ ప్రకారం ఇద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత విడిగా కాపురం పెడతారు. ఆ టైంలో బోలెడంత ఘాటు కంటెంట్ పెట్టొచ్చు. కానీ శివ నిర్వాణ మాత్రం నిన్ను కోరి, మజిలీ తరహాలో ఫ్యామిలీస్ నే మళ్ళీ టార్గెట్ చేసుకున్నాడు.

బిజినెస్ పరంగా అరవై కోట్ల దాకా అమ్ముడుపోయిన ఖుషి సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో పబ్లిసిటీ వేగాన్ని పెంచబోతున్నారు. సమంతా తిరిగి వెళ్లబోయే ముందు ఇంకొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చేసి తన వంతు బాధ్యతను పూర్తి చేస్తుంది. మళ్ళీ ఇంకో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారా లేదానేది ఇంకా తెలియదు. ఇంకో పదమూడు రోజులు టైం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఓ వేడుక చేయాలనే ఆలోచనలో ఉన్నారు మైత్రి అధినేతలు. లైగర్ గాయం ఖుషి దెబ్బకు పూర్తిగా మాయమైపోయి తనకు మునుపటి ఫామ్ వస్తుందని ఎదురు చూస్తున్న విజయ్ ఈసారైనా బ్రేక్ అందుకుంటాడేమో చూడాలి.

This post was last modified on August 18, 2023 1:13 pm

Share

Recent Posts

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

5 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

5 hours ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

9 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

10 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

10 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

10 hours ago