ఊహించని విధంగా మెగాస్టార్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన భోళా శంకర్ నిర్మాత అనిల్ సుంకర దీని నష్టాల వల్లే ఇబ్బందులు పడుతున్నారని, పలు ఆస్తులు అమ్మి డ్యామేజీని భర్తీ చేసే ప్లాన్ చేసే ప్లాన్ లో ఇలా ఏదేదో ప్రచారం జరిగింది. ఇంతే కాదు చిరంజీవి తనకు రావలసిన పారితోషికం గురించి పట్టు పట్టినందువల్లే ఇలా జరిగిందనే పుకారు కూడా రెక్కలు తొడిగింది. ఒకపక్క ఫ్లాప్ ఫలితం, ఇంకో వైపు ఈ వార్తల షికారు వెరసి సోషల్ మీడియా ట్రోల్స్ కు హద్దు అదుపు లేకుండా పోయింది. ఫైనల్ గా స్వయానా అనిల్ సుంకర దీనికి ట్విట్టర్ వేదికగా చెక్ పెట్టారు.
కొందరి వినోదాన్ని సంతృప్తి పరచడం కోసం పుకార్లు పుట్టొచ్చు, కానీ దాని కోసం దశాబ్దాల తరబడి ఒకరు సంపాదించుకున్న పేరుకి నష్టం కలిగించాలని చూడటం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాని నేరం. నాకు చిరంజీవికి మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలేవీ నిజాలు కాదు. అంతా ట్రాష్. నాకు ఎప్పుడూ మద్దతుగానే ఉన్నారు. ఎప్పటిలాగే స్నేహంగా ఉంటారు. నిజాలను ద్వేషంతో కప్పొద్దు. ఇలాంటివి సృష్టించడం కొందరికి ఫన్ కావొచ్చు, కానీ వాటి ప్రభావం పని చేసిన అందరి మీదా ఉంటుంది. నాకు మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ మళ్ళీ కంబ్యాక్ అవుతానని తెలియజేసుకుంటున్నాను.
ఇది అనిల్ సుంకర పెట్టిన పూర్తి ట్వీట్ తాలూకు పాఠం. మొత్తానికి విపరీత ప్రచారానికి బ్రేక్ వేసేలా అనిల్ సుంకర స్పందించడం పట్ల మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏజెంట్ టైంలోనూ రిజల్ట్ పరంగా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురుకున్న ఈ అగ్ర నిర్మాతకు తగిన హిట్ దక్కాలని ఇండస్ట్రీ వర్గాలతో పాటు మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. భోళా శంకర్ ఫైనల్ రన్ కు చాలా దగ్గరలో ఉంది. ఎంతమేరకు నష్టాలు వస్తాయనేది ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది కానీ మెగాస్టార్ తో మరో సినిమా చేసే అవకాశం వస్తే ఈసారి పొరపాటే లేకుండా చూసుకుంటానని అనిల్ సుంకర తన సన్నిహితులతో అంటున్నారట.
This post was last modified on August 18, 2023 1:27 am
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలోని ఓఎన్జీసీ మోరి-5 డ్రిల్లింగ్ సైట్లో గత కొన్ని రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గతంలో సంక్రాంతి సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ వేసిన వీడియో…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…