బాక్సాఫీస్ వద్ద సునామిలా విరుచుకుపడ్డ జైలర్ మొదటి వారం తిరక్కుండానే ఏ స్థాయిలో వసూళ్ల భీభత్సం చేసిందో చూశాం. ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు సౌత్ మీడియాలో నాలుగు వందల కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్టు వెలువరించాయి. కట్ చేస్తే ఇవాళ నిర్మాతలు సన్ పిక్చర్స్ దాన్ని సరిచేసి మూడు వందల డెబ్భై అయిదు కోట్లుగా ఒక అఫీషియల్ పోస్టర్ ద్వారా ప్రకటించడం కొత్త చర్చకు దారి తీసింది. మాములుగా నిర్మాణ సంస్థలు లేని నెంబర్లు జోడించి జనాలను నమ్మించి థియేటర్లకు రప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తాయి. కానీ జైలర్ కు రివర్స్ జరుగుతోంది.
దీని పట్ల రజని అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా పెద్దగా అంకెలను వేసి దాని కింద చిన్న బ్రాకెట్ లో టెంటెటివ్ అని వేయడం పట్ల భగ్గుమంటున్నారు. అదేదో స్పష్టంగా తెలుసుకుని వేయకుండా ఎందుకీ తొందరపాటని కస్సుమంటున్నారు. వాళ్ళ ఆవేదనలో న్యాయం లేకపోలేదు. విక్రమ్, పొన్నియిన్ సెల్వన్ లైఫ్ టైం వసూళ్లను కేవలం రెండు వారాల లోపే తిరగరాసే ఛాన్స్ దొరికినప్పుడు దాన్ని వీలైనంత హైలైట్ చేసుకుంటూ ప్రమోషన్లు చేయాలి. కానీ దానికి భిన్నంగా అయోమయం సృష్టించడం పట్ల సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సరే ఇప్పుడెలాగూ చేసేశారు కాబట్టి వెనక్కు తీసుకోలేరు కానీ ఇకపైన జాగ్రత్త తీసుకోమని కోరుతున్నారు. తమిళనాడులో జైలర్ ఉధృతి మాములుగా లేదు. ఏడో రోజు సైతం చాలా చోట్ల తెల్లవారుఝామున షోలు వేయాల్సి వచ్చిందట. రాబోయే వీకెండ్ నమ్మశక్యం కాని రీతిలో ఆక్యుపెన్సీలు ఉంటాయని, దెబ్బకు ఎవరూ ఈ నెలాఖరు దాకా కొత్త రిలీజులు ప్లాన్ చేసుకోలేరని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా జైలర్ బ్లాక్ బస్టర్ స్థాయిని దాటేసి అంతకు మించి విజయాన్ని సాధించిన మాట వాస్తవం. అది ఎవరూ కాదనలేరు. ఫైనల్ రన్ అయ్యేలోపు ఇంకెన్ని రికార్డులు నమోదు చేస్తుందో.
This post was last modified on August 18, 2023 1:21 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…