జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న దేవర మీద అంచనాల గురించి చెప్పనక్కర్లేదు. విడుదల తేదీ ఇంకా దూరం ఉంది కానీ అప్పుడప్పుడు సందర్భానికి తగ్గట్టు టీమ్ వదులుతున్న పోస్టర్లు మీద మిశ్రమ స్పందన రావడం అభిమానుల్లో కొంత ఆందోళన రేకెత్తిస్తున్న మాట వాస్తవం. నిన్న సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్న విలన్ పాత్ర భైరా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. జులపాల జుట్టుతో సైడ్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చినట్టుగా ఉన్న స్టిల్ అంచనాలు పెంచేలా లేదని నెటిజెన్లు పెదవి విరిచారు. ఇంకేదైనా డిఫరెంట్ గా ఇవ్వాల్సింది అభిప్రాయపడుతున్నారు.
వీటి మీద సినిమా గురించి ఒక అంచనాకు రావడం తొందపాటు అవుతుంది కానీ కెజిఎఫ్, సలార్ రేంజ్లో బడ్జెట్ ఖర్చు పెడుతున్నప్పుడు పబ్లిసిటీ కూడా అంతే హైప్ వచ్చేలా చేయాలనేది ఫ్యాన్స్ అభిప్రాయం. స్క్రిప్ట్ విషయంలో ఎంత మాత్రం రాజీ లేకుండా నెలల తరబడి ఆలస్యమవుతున్నా వెయిట్ చేసి మరీ బెస్ట్ రాయించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడీ ప్రమోషన్స్ గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరుతున్నారు. అయితే ఇంకా చాలా షూటింగ్ పెండింగ్ ఉంది. పాటల చిత్రీకరణ మొదలు కాలేదు. అనిరుద్ రవిచందర్ సాంగ్స్ ఇవ్వగానే వాటిని షెడ్యూల్ చేయబోతున్నారు.
తలమునకలయ్యేంత పనిలో బిజీగా ఉన్న తారక్, శివలిద్దరూ ఇప్పటికిప్పుడు దీని మీద ఫోకస్ పెట్టలేకపోయినా ఇంకాస్త జాగ్రత్తగా ఉండటం అవసరమే. పేరుకు టైం ఉందనే మాటే కానీ 2024 ఏప్రిల్ 5 సరిగ్గా ఏడున్నర నెలలు గడిచిపోతే వచ్చేస్తుంది. సోలో హీరోగా జూనియర్ మొదటి ప్యాన్ ఇండియా మూవీ కావడంతో అంతర్జాతీయ స్థాయిలో హైప్ వచ్చేలా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఆడియోతో మొదలుపెట్టి ట్రైలర్ దాక ప్రతిదీ ఎగ్జైట్ మెంట్ తో ముడిపడి ఉంటుంది. ఒక చిన్న పోస్టర్ వచ్చినా చాలు టాక్ అఫ్ ది సోషల్ మీడియాగా మారాలి. అదే ఫ్యాన్స్ కోరిక.
This post was last modified on August 17, 2023 3:27 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…