ఈ రోజుల్లో సినిమాల ప్రమోషన్లు మామూలుగా సాగితే జనాల దృష్టిలో పడటం కష్టం. సినిమాలో కంటెంట్ ఉన్నా సరే.. ప్రోమోలు సెన్సేషనల్‌గా ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రమోషన్లు కొంచెం భిన్నంగా చేసి సినిమా గురించి జనాల నోళ్లలో నానేలా చూసుకోవాలి. అందుకే యువ కథానాయకులు, ఫిలిం మేకర్స్ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలతో ముందుకు వెళ్తున్నారు. ఇందుకోసం కొంచెం బోల్డ్‌గానూ ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ అనగానే ప్రమోషన్ల వ్యవహారమే వేరుగా ఉంటుంది.
తాజాగా ఖుషి సినిమా మ్యూజికల్ కన్సర్ట్ వేడుకలో సమంతతో కలిసి అతను స్టేజ్ మీద రొమాన్స్‌ను పండించిన తీరు.. వాళ్లిద్దరి కెమిస్ట్రీ చర్చనీయాంశం అయింది. ఈ విషయంలో కొన్ని విమర్శలు వచ్చినా ఖుషి టీం పట్టించుకోలేదు. విజయ్, సామ్ హద్దులు దాటారని విమర్శలు కొనసాగుతున్న సమయంలోనే ఇంకో పెయిర్ ఇదే స్టయిల్లో స్టేజ్ మీద రొమాన్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి సుట్టంలా సూసి అనే పాటను బుధవారం లాంచ్ చేశారు.
హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో హీరో హీరోయిన్లు విశ్వక్సేన్, నేహా శెట్టి ఒక బోల్డ్ యాక్ట్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ పాటలో నేహా చీరలో చాలా సెక్సీగా కనిపించింది. ఆ పాటకు తగ్గట్లే స్టేజ్ మీద తన చీర కొంగును తీసి.. విశ్వక్‌కు ఇవ్వడం.. అతను దాన్ని నోట్లో పెట్టుకోవడం.. చుట్టుకోవడం.. అలాగే ఇద్దరూ కలిసి స్టెప్పులేయడం.. ఇలా స్టేజ్ మీద ఇద్దరి రచ్చ మామూలుగా లేదు. ఈ వీడియో కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. విజయ్, సామ్‌లను విశ్వక్, నేహా కాపీ కొట్టారని కొందరంటే.. ప్రమోషన్ల పేరుతో ఏమిటీ అతి అంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
This post was last modified on August 16, 2023 9:47 pm
థియేటర్లో ఆడిన ఎంత పెద్ద హిట్ సినిమాలనైనా టికెట్లు కొని చూడని ప్రేక్షకులు బోలెడు ఉంటారు. వాళ్లకు ఒకప్పుడు శాటిలైట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు…
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…
ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రుతురాజ్ గైక్వాడ్‌కు…
నిజమే… నిన్నటిదాకా ఏపీలో ఎవరిపై ఎవరైనా నోరు పారేసుకున్నారు. అసలు అవతలి వ్యక్తులు తమకు సంబంధించిన వారా? లేదా? అన్న…