విజయ్ దేవరకొండను యాటిట్యూడ్ కా బాప్ అంటుంటారు నెటిజన్లు. అనామకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఎదిగాడంటే అందుకు విజయ్ ఆన్ స్క్రీన్ పెర్ఫామెన్స్ ఒక్కటే కారణం కాదు. ఇప్పటి యూత్‌కు బాగా కనెక్టయ్యేలా అతను బయట చూపించే ఒక ప్రత్యేకమైన యాటిట్యూడ్.. సోషల్ మీడియాలో అతడికి తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చి పెట్టింది. ఎప్పుడూ అతను టాక్ ఆఫ్ ద టౌన్‌గా ఉండేలా చేసింది.
తన సినిమాలను విజయ్ ప్రమోట్ చేసే తీరు కూడా వేరే లెవెల్ అనే చెప్పాలి. తన మీద వచ్చిన మీమ్స్‌ను స్టేజ్ మీద ప్లే చేయించి కామెడీ పండించినా.. థియేటర్ విజిట్‌కు వెళ్లినపుడు క్యాంటీన్ బిల్ అంతా తనే కట్టినా అది విజయ్‌కే చెల్లింది. తన ప్రసంగాలు కూడా యూత్‌కు వెర్రెత్తించేలా ఉంటాయి. స్టేజ్ మీద విజయ్ ఎప్పుడు ఏం చేస్తాడో అంచనా వేయలేని విధంగా ఉంటుంది. ఐతే ‘లైగర్’ సినిమా సమయంలోనూ విజయ్ తన స్టయిల్లోనే ప్రమోషన్లు చేశాడు. కానీ ఈ సినిమా గురించి అతను చెప్పుకున్న గొప్పలకు మ్యాచ్ చేసేలా కంటెంట్ లేకపోవడంతో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌కు గురయ్యాడు.
ముఖ్యంగా ఈ సినిమా కలెక్షన్ల లెక్క రూ.200 కోట్ల నుంచి మొదలవుతుందంటూ చేసిన అతి కామెంట్‌తో తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఈ సినిమా మరీ దారుణమైన డిజాస్టర్ కావడం విజయ్‌కి పెద్ద షాకే. ఆ దెబ్బకు కొన్ని రోజులు విజయ్ సైలెంట్ అయిపోయాడు. ఒక స్టేజ్ మీద ఎమోషనల్ అయి దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశాడు. విజయ్ అగ్రెషన్ మీద ‘లైగర్’ చాలా ప్రభావం చూపిందని.. ఇకపై అతను ముందులా ఉండకపోవచ్చని అప్పట్లో విశ్లేషణలు చేశారు నెటిజన్లు.
కట్ చేస్తే ఇప్పుడు ‘ఖుషి’ విడుదలకు సిద్ధమవుతోంది. మొన్నటిదాకా విజయ్ కొంచెం హద్దుల్లోనే ఉన్నాడు. కానీ నిన్నటి మ్యూజికల్ కన్సర్ట్‌లో మళ్లీ పాత విజయ్‌ను గుర్తు చేశాడతను. సమంతతో కలిసి స్టేజ్ మీద అతను చేసిన రొమాంటిక్ విన్యాసాలు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి. ఇది చూశాక విజయ్ ఏమీ మారలేదని.. ఎవరు ఏమన్నా విజయ్ స్టైల్ విజయ్‌దే అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. పాటలు, ట్రైలర్‌కు తోడు.. అగ్రెసివ్ ప్రమోషన్లతో ‘ఖుషి’కి హైప్ అయితే బాగానే తీసుకొస్తున్నారు కానీ.. ఈసారైనా విజయ్ కంటెంట్‌తో మెప్పించి తన స్థాయికి తగ్గ హిట్ అందుకుంటాడేమో చూడాలి.
This post was last modified on August 16, 2023 9:33 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…