భోళా శంకర్ దారుణ ఫలితం తర్వాత చిరంజీవి తన నిర్ణయాలని పునః సమీక్షించుకుంటున్న మాట వాస్తవం. ఆల్రెడీ కమిటైనవి కూడా విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో కళ్యాణ్ కృష్ణ తో ప్లాన్ చేసుకున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని వాయిదా వేస్తున్నారనే వార్త ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలే ఇది బ్రో డాడీ రీమేకనే ప్రచారం విపరీతంగా తిరిగింది. మెగా ఫ్యాన్స్ తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు కూడా. అయితే అనఫీషియల్ గా దీన్ని ఖండిస్తూ వచ్చిన రైటర్స్ టీమ్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేకపోయింది. ఇప్పుడో కొత్త ట్విస్టు వచ్చి పడింది.
చిరు తమిళ దర్శకుడు మురుగదాస్ కాంబోలో ఓ ప్రాజెక్టు ఉండబోతోందనే టాక్ ఊపందుకుంది. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇది అంత సులభంగా సాధ్యం కాదు. ఎందుకంటే దాస్ ఇప్పటికే శివ కార్తికేయన్ తో ఓ మూవీని ప్లాన్ చేసుకున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ప్రాధమిక చర్చలు కూడా జరిగాయని చెన్నై మీడియాలో వచ్చింది. సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచందర్ నే తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో హఠాత్తుగా దాన్నుంచి పక్కకు వచ్చేసి మురుగదాస్ మెగాస్టార్ తో చేతులు కలపడం ఏ కోణంలో చూసినా అనుమానమే.
ఈ ఇద్దరి కలయికలో స్టాలిన్ వచ్చింది. అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయినా కంటెంట్ ప్లస్ చిరు హీరోయిజం ఫ్యాన్స్ కి బాగా నచ్చాయి. కానీ మురుగదాస్ చాలా కాలం నుంచే ఫామ్ లో లేరు. రజనీకాంత్ పిలిచి దర్బార్ ఇస్తే దాన్ని సద్వినియోగపరుచుకోలేదు. గజిని నాటి బ్రిలియంట్ మేకర్ ఆయనలో లేడని అభిమానులు ఫీలవుతుంటారు. అలాంటిది చిరంజీవి కోరిమరీ చేయమని చెప్తారా అంటే సందేహమే. ఇదే తరహాలో వివి వినాయక్ తోనూ చిరంజీవి చేస్తారనే లీక్ తిరుగుతోంది కానీ అది కూడా ఉత్తుత్తి పుకారేనని మెగా కాంపౌండ్ టాక్. చిన్న సర్జరీ కోసం ఢిల్లీ వెళ్లిన చిరు వచ్చాకే క్లారిటీ రావొచ్చు.
This post was last modified on August 16, 2023 7:02 pm
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…