కొద్దిరోజుల క్రితం రజనీకాంత్ – అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ లో జై భీం దర్శకుడు టిజె జ్ఞానవేల్ తీయబోయే సినిమాలో న్యాచురల్ స్టార్ నానికి ఓ కీలక పాత్ర ఆఫర్ చేశారనే వార్త గట్టిగానే తిరిగింది. నిప్పు లేనిదే పొగరాదు తరహాలో చెన్నై మొదలైన ఈ న్యూస్ హైదరాబాద్ దాకా పాకిపోయింది. అయితే తెరవెనుక పరిణామాలు ఏం జరిగాయో కానీ ఇప్పుడా స్థానంలో శర్వానంద్ రాబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా మొదలవ్వలేదు. స్క్రిప్ట్ మాత్రమే లాక్ అయ్యింది. రజని హిమాలయాల నుంచి తిరిగి వచ్చాక రెగ్యులర్ షూటింగ్ కోసం డేట్లు ఫిక్స్ చేస్తారు.
నిజంగానే నాని వదులుకున్నాడా లేక ఇంకేదైనా సమస్య వల్ల నో చెప్పాల్సి వచ్చిందా అనేది ఇంకా తెలియదు. సూపర్ స్టార్, బిగ్ బి షేర్ చేసుకునే స్క్రీన్ లో భాగం కావడమంటే అంత కన్నా అదృష్టం ఉండదు. అయితే ఇన్ సైడ్ టాక్ లో వినిపిస్తోంది ఏంటంటే ఈ ముగ్గురి కాంబో సీన్లు స్క్రీన్ మీద ఉండవట. స్టోరీ అలా ఉందని, రజని అమితాబ్ లు కలిసే ఎపిసోడ్లు ఉంటాయి కానీ మూడో పాత్రలో నటించే యూత్ స్టార్ ట్రాక్ వేరుగా ఉంటుందని అంటున్నారు. బహుశా ఈ కారణం వల్లే నాని నో చెప్పి ఉండే అవకాశాలను కొట్టిపారేయలేం. ఏదీ అఫీషియల్ కాదు కాబట్టి ఖచ్చితంగా చెప్పలేం.
ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమా చేస్తున్న శర్వానంద్ కు మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్టులోనూ భాగం కాబోతున్నాడనే వార్త గత రెండు వారాలుగా చక్కర్లు కొడుతూనే ఉంది. సిద్దు జొన్నలగడ్డ స్థానంలో కళ్యాణ్ కృష్ణ తీయబోయే మెగా మూవీలో శర్వా ఓకే అయ్యాడనే టాక్ కు సైతం ఎలాంటి నిర్ధారణ లేదు. వరస ఫ్లాపుల తర్వాత ఒకే ఒక జీవితంతో తిరిగి హిట్ ట్రాక్ లోకి వచ్చిన శర్వానంద్ ఈ మధ్యే ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. ఏదైతేనేం నిజంగానే రజని అమితాబ్ సినిమాలో ఛాన్స్ కన్ఫర్మ్ అయితే ఒక చిరకాల జ్ఞాపకం ఫిల్మోగ్రఫీలో ఉండిపోతుంది.
This post was last modified on August 16, 2023 4:52 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…