నిర్మాతగా ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా డిస్ట్రిబ్యూషన్ మాత్రం ఆపలేదు దిల్ రాజు. ఓవైపు గ్యాప్ లేకుండా పెద్ద సినిమాలు నిర్మిస్తూనే.. ఇంకోవైపు నైజాం ఏరియాలో తరచుగా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు రాజు. అలా అని ఆయన ఏ సినిమా పడితే ఆ సినిమాను పంపిణీ చేయడు. ఏది వర్కవుట్ అవుతుందో సరిగ్గా అంచనా వేసి హక్కులు తీసుకుంటూ ఉంటాడు. చాలా వరకు ఆయన జడ్జిమెంట్ కరెక్ట్ అవుతుంటుంది.
తాజాగా రాజుకు ‘జైలర్’ రూపంలో జాక్‌పాట్ దక్కింది. రజినీ గత సినిమాల ప్రభావం వల్ల ‘జైలర్’ రైట్స్ తక్కువ మొత్తానికే అమ్మారు. పెట్టుబడి మీద ఈ చిత్రం మూడు రెట్ల దాకా ఆదాయం తెచ్చిపెడుతుండటం విశేషం. ఈ ఏడాది మిగిలిన నాలుగు నెలల్లో రాజు నుంచి మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. దసరాకు ఆయన ఒకేసారి రెండు సినిమాలను నైజాం ఏరియాలో రిలీజ్ చేస్తుండటం విశేషం.
ఆల్రెడీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్‌ను ఫ్యాన్సీ రేటుకు తీసుకున్నాడు రాజు. దీంతో పాటుగా ‘లియో’ రైట్స్ కూడా నైజాం వరకు చేజిక్కించుకున్నట్లు సమాచారం. ‘లియో’ తెలుగు హక్కులను హోల్‌సేల్‌గా సితార సంస్థ తీసుకుంది. వారి నుంచి నైజాం రైట్స్‌ను మారు బేరానికి రాజు తీసుకున్నట్లు సమాచారం.
ఒకే సీజన్లో రెండు క్రేజీ సినిమాలను ఒకే పంపిణీ సంస్థ రిలీజ్ చేయడం విశేషమే. కానీ రాజుకు ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ సంక్రాంతి టైంలో ఇలా చేశాడు. ‘భగవంత్ కేసరి’ మీద భారీ అంచనాలే ఉన్నాయి. బాలయ్య కెరీర్లోనే అత్యధిక బిజినెస్ చేస్తోంది ఈ చిత్రం. ఇప్పుడు బాలయ్య టైం నడుస్తోందని రాజుకు అర్థమై మంచి రేటు పెట్టి రైట్స్ తీసుకున్నాడు. అలాగే విజయ్‌కి తెలుగులో క్రేజ్ పెరిగిన నేపథ్యంలో ‘లియో’ రైట్స్‌కు కూడా ఫ్యాన్సీ రేటే ఇచ్చారట రాజు. మరి దసరాకు రాజు డిస్ట్రిబ్యూటర్‌గా డబుల్ ధమాకా కొడతారేమో చూడాలి.
This post was last modified on August 16, 2023 3:10 pm
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…