ఏకంగా పఠాన్ రికార్డులకే ఎసరు పెట్టేలా కనిపిస్తున్న గదర్ 2 ఓవర్సీస్ లో మాత్రం డిజాస్టర్ అయ్యేలా ఉందని విశ్లేషకుల అంచనా. ఇప్పటిదాకా కనీసం అయిదు మిలియన్ డాలర్లు దాటలేకపోవడం పట్ల బయ్యర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రిలీజైన రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని ఆల్రెడీ పది మిలియన్లు దాటేసిందట. పఠాన్ కనివిని ఎరుగని రీతిలో 45 మిలియన్లకు పైగా వసూలు చేసింది. కానీ గదర్ 2 వీటి దరిదాపుల్లోకి వెళ్లడం అసాధ్యంలా కనిపిస్తోంది. ఇండియాలో మాత్రం బిసి సెంటర్స్ అరాచకం మాములుగా లేదు. స్వతంత్ర దినోత్సవం నాడు సైతం యాభై కోట్లను దాటేసింది టాక్.
ఇప్పటికే రెండు వందల యాభై కోట్లకు అతి దగ్గరలో ఉన్న గదర్ 2 ఫైనల్ రన్ అయ్యేలోపు షారుఖ్ ఖాన్ సెట్ చేసిన బెంచ్ మార్కుని దాటడం ఖాయమనే నమ్మకాలు బలంగా వ్యక్థమవుతున్నాయి. అయితే అమెరికాలో ఇంత వీక్ గా పెర్ఫార్మ్ చేయడానికి కారణాలు లేకపోలేదు. సన్నీడియోల్ పంజాబీ మాస్ ఎన్ఆర్ఐలకు అంతగా ఎక్కడం లేదు. పైగా ఎంత గ్రాండ్ గా నిర్మించినా ప్రొడక్షన్ వేల్యూస్ మరీ స్టయిలిష్ గా అయితే లేవు. దానికి తోడు మ్యూజికల్ గానూ రీమిక్స్ చేసిన రెండు పాటలు తప్ప మిగిలినవి అక్కడి పబ్లిక్ కి అంతగా కనెక్ట్ కాలేదు. సో దెబ్బ తినక తప్పలేదు
ఓ మై గాడ్ 2 సైతం అంతగా ఆకట్టుకోలేదని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఆదరిస్తున్నారు కానీ సెక్స్ ఎడ్యుకేషన్ పట్ల మంచి అవగాహన యుఎస్ లాంటి దేశాల్లో ఓఎంజి 2లో సీరియస్ నెస్ ని లైట్ తీసుకుంటున్నారు. ఫలితంగా గదర్ 2 కంటే వెనుకబడే ఉందని రిపోర్ట్. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే రజనీకాంత్ జైలర్ కు దక్కిన భీభత్సమైన రెస్పాన్స్ నేరుగా రెండు హిందీ సినిమాలపై పడింది. వీటి కంటే సూపర్ స్టార్ స్టయిలిష్ మాసే బెటరని దానికే ఫిక్స్ అయిపోతున్నారు. ఒక సౌత్ మూవీ బాలీవుడ్ ని డామినేట్ చేయడం చాలా అరుదు.
This post was last modified on August 16, 2023 3:07 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…