జైలర్ రాకముందు వరకు రజనీకాంత్ మార్కెట్ ఇతర భాషల్లో ఎంతో పడిపోయిందే అనుకుంటున్న టైంలో ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి. వారం తిరగకుండానే ఏకంగా 400 కోట్ల వసూళ్లను దాటేయడం చూసి ఎవరికీ నోట మాట రావడం లేదు. భోళా శంకర్ టాక్ ఎంత బ్యాడ్ గా ఉన్నా దానికి రావాల్సిన కనీస వసూళ్లను దెబ్బేసే రేంజ్ లో సూపర్ స్టార్ అరాచకం బయ్యర్ల పాలిట కామధేనువుగా మార్చేసింది. ఇంకో వారం పది రోజులు ఇదే దూకుడు కొనసాగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి రజని కూతురు జాక్ పాట్ కొట్టడానికి లింక్ ఏంటనేగా డౌట్.
అక్కడికే వద్దాం. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో లాల్ సలామ్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కీలక భాగం షెడ్యూల్స్ పూర్తి చేశారు. కూతురు కోసం తండ్రి ఒక ప్రత్యేక క్యామియో చేశారు. మరీ తక్కువ నిడివి కాకుండా కాస్త చెప్పుకోదగ్గ లెన్త్ తో ఈ పాత్ర ఉంటుందట. ఈ భాగం చిత్రీకరణ అయిపోయింది. విష్ణు విశాల్ హీరోగా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం మీద మంచి అంచనాలున్నాయి. గెస్టు రోల్స్ కి ఎప్పుడో గుడ్ బై చెప్పిన రజని కేవలం ఐశ్యర్యకు బ్రేక్ దక్కాలనే ఉద్దేశంతో కథ నచ్చి రెండో ఆలోచన చేయకుండా ఎస్ అన్నారు.
కట్ చేస్తే జైలర్ దెబ్బకు ఇప్పుడు లాల్ సలామ్ కు డిమాండ్ పెరిగింది. ఎందుకంటే తలైవర్ నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమా ఇదే. కొత్తవి మొదలుపెట్టలేదు. హిమాలయాలకు వెళ్లిన రజని తిరిగి వచ్చాక కొంత రెస్ట్ తీసుకుని ఆ తర్వాత జై భీం టిజె జ్ఞానవేల్ సెట్లో పాల్గొంటారు. అయితే దీనికి టైం పట్టేలా ఉంది. జైలర్ ఫీవర్ తో ఊగిపోతున్న జనాలకు తక్కువ గ్యాప్ లో లాల్ సలాంతో రజని దర్శనమిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. పైగా ఇందులో ముస్లిం వర్గానికి చెందిన డాన్ గా నటించారు. బిజినెస్ ఆఫర్లు చూస్తుంటే లైకా సంస్థ నిర్మాతలకు నోట మాట రావడం లేదట.
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…